చంద్రబాబు నిప్పు అంటారు. ఆయనది నలభయ్యేళ్ళ రాజకీయం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాదు, అన్న ఎన్టీయార్ కంటే కూడా ఎక్కువ ఏళ్ళు పరిపాలించారు. ఇక మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలిగారు. అటువంటి బాబు తన తన రాజకీయ జీవితంలో ఏ తప్పు కూడా చేయలేదని అంటారు. నీతి నిజాయతీలకు మారు పేరు అని చెప్పుకుంటారు.


మరో వైపు విపక్షాలు మాత్రం బాబు అవినీతిపరుడు అంటారు. ఆయన 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని కూడా విమర్శలు చేస్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని పెడబొబ్బలు పెడతారు. ఇలా అన్నవారు ఎవరూ బాబు గురించి కచ్చితమైన ఆధారాలు కానీ వ్యవహారాలు కానీ ఇప్పటివరకూ ప్రవేశపెట్టలేకపోయారు. బాబు మీద ప్రజా వ్యాజ్యాలు అనేకం పడ్డాయి. అందులో లక్ష్మీ పార్వత్తి, వైఎస్సార్ సతీమణి విజయమ్మ వేసిన పిల్స్ కూడా ఉన్నాయి. 


మరి ఎన్ని ఎవరు వేసినా కూడా బాబుకు ఏం కాలేదు. బాబూ నిన్ను బ్రహ్మదేముడు కూడా రక్షించలేడంటూ హూంకరించిన కేసీయార్ సైతం ఓటుకు నోటుకు కేసులో ఏం చేయలేకపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబు మీద హాట్ కామెంట్స్ చేశారు. బాబు తన పాలనల్లో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, అవన్నీ తవ్వి తీస్తే ఆయనకు 16 ఏళ్ళు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందని కూడా తీర్పు చెప్పేశారు. మరి మంత్రి గారు పవర్ ఉపయోగించి ఆ అవకతవకలు ఏవో బయటపెట్టవచ్చుకదా అని అంటున్నారు. వూరకే ఆరోపణలు చేయడం ఎందుకని కూడా అంటున్నారు. బాబు నిజంగా నిప్పు కాదు అని నిరూపించగలరా. అధికారంలో ఉన్న వారు మాట్లాడకూడదు, ఆధారాలు ఉంటే చేసి చూపించాలంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: