మోడీ ప్రధానిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అనేక విషయాలపై దృష్టి పెట్టారు.  తలాక్ బిల్లుతో మోడీ 2.0 సర్కార్ వారి ప్రస్థానాన్ని ప్రారంభించింది.  ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న తలాక్ బిల్లును చట్టసభల్లో ఆమోదింపజేసింది.  ఈ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టి ముస్లిం మహిళలకు లబ్ది చేకూరేలా చేశారు. దీంతో ముస్లిం మహిళల్లో మోడీకి మంచి పేరు వచ్చింది.  


ఈ బిల్లును విజయవంతగా ప్రవేశపెట్టడంతో మోడీ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.  కాశ్మీర్ లో అభివృద్ధి జరగడం లేదు.  ప్రత్యేక ప్రతిపత్తి కారంణంగా ఆ రాష్ట్రానికి నిత్యం కోట్లాది రూపాయల నిధులను అందిస్తూ వస్తున్నారు.   కానీ, అక్కడి యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు.. ఆర్మీపై దాడులు చేస్తున్నారు.  ఆర్మీపై రాళ్ళూ రువ్వుకున్న యువకులపై యాక్షన్ తీసుకోవడానికి ఆర్మీకి 370 అధికరణ అధికారం లేకుండా చేసింది.  


దీనిపై దృష్టిపెట్టిన మోడీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసింది.  72 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యను మోడీ సర్కార్ పరిష్కరించింది.  ఆర్టికల్ రద్దుతో పాటు జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.  ఆగష్టు 5 వ తేదీన ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.  ఇది జరిగిన మూడు నెలలకు 134 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న అయోధ్య కేసు పరిష్కారం జరిగింది.  


అయోధ్య కేసులో రామ మందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.  బీజేపీ మ్యానిఫెస్టోలో రామ్ మందిరం నిర్మాణం గురించి కూడా ఉన్నది.  కాగా, ఇప్పుడు బీజేపీ సర్కార్ మరో రెండింటిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అవేమంటే.. ఒకటి శ్రీకృష్ణుడు జన్మస్థానంగా చెప్పుకునే మధుర, రెండోది శివుడు కొలువైన కాశీ.  వారణాసీలోని కాశీ విశ్వనాథ దేవాలయం, జ్ఞానవాపి మసీదు ఆనుకొనే ఉంటాయి. శతాబ్దాల క్రితం ఆలయాన్ని ధ్వంసం చేసి 1669లో ఔరంగజేబు మసీదును నిర్మించారని ప్రచారంలో ఉంది. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం మసీదు, దేవాలయ పరిసరాల్లోని ఇతర కట్టడాలను 2018లో మోదీ ప్రభుత్వం కూల్చి వేయడంతో మసీదునూ కూల్చి వేస్తారేమోనని ముస్లిం వర్గాల్లో ఆందోళన మొదలైంది. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయ సముదాయం పక్కనే షాహీ ఈద్గా మసీదు ఉంది. అయితే, కేశవనాథ్‌ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఔరంగజేబు ఈ మసీదును నిర్మించాడన్నది ప్రధాన ఆరోపణ.  దీనికి సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ కేసులను కూడా అయోధ్య తరహాలోనే పరిష్కరిస్తారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: