రెవెన్యూ వివాదంలో...మ‌రో కీల‌క బెదిరింపు...ఊహించ‌ని నిర్ణ‌యం వెలుగులోకి వ‌చ్చింది.‘నా భూమికి పాస్‌బుక్‌ ఇవ్వు. లేకపోతే తాసిల్దార్‌ విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అని మూడు రోజుల క్రితం కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను ఫోన్‌లో బెదిరించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్ బెదిరించిన విషయం తెలిసిందే. ఇలా బెదిరింపులకు పాల్ప‌డిన కానిస్టేబుల్‌ను  కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెండ్‌ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిపై సెక్షన్‌ 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 


శ్రీనివాస్‌రెడ్డికి, ఆయన సోదరుడికి కలిపి తాడ్వాయిలోని సర్వేనంబర్ 191లో 9.20 ఎకరాల భూమి ఉండేదని, అది భార్యల పేరిట ఉండగా.. గతంలో సాదాబైనామా ద్వారా ఇతరులకు విక్రయించారని అధికారులు పేర్కొంటున్నారు. ఆ భూమిని కొన్నవారు ఇంకా పాస్‌పుస్తకాలు పొందలేదని తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి.. ఎలాగైనా ఆ స్థలంపై కొత్త పాస్‌బుక్ తిరిగి పొందాలని భావించాడని, పలుమార్లు ఎమ్వార్వో కార్యాల‌యం చుట్టూ తిరిగాడని తెలిపారు. అనుమానం వచ్చిన ఎమ్మార్వో విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి.. ఆయన సూచన మేరకు ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. తనకు పాస్‌బుక్ ఇవ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని భావించిన శ్రీనివాస్‌రెడ్డి..``నా భూమికి పాస్‌బుక్ ఇవ్వు. లేకపోతే తహ‌శీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది`` అంటూ గ‌త బుధవారం రాత్రి కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు బెదిరింపు ఫోన్‌కాల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ కలకలం రేపింది. ఈ బెదిరింపులపై రాజేంద్రకుమార్ గురువారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బెదిరించిన వ్యక్తిని తాడ్వాయికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించామని, నిందితుడు హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని సీఐ జగదీశ్ తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డిపై సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. 


తాజాగా ఆర్డీవోకు ఫోన్‌చేసి బెదిరించిన కేసులో పోలీసు ఉన్న‌తాధికారులు...కానిస్టేబుల్ శ్రీ‌నివాస్ రెడ్డికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక‌య్యే షాక్ ఇచ్చారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను స‌స్పెండ్ చేస్తూ... కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి ఆదేశాలు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: