ఏపీలోని రాజకీయానికి ఇసుక బాగా దొరికింది. ఓ వైపు ఇసుక సరఫరా  బాగా పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య వరకూ రోజుకు 40 టన్నుల ఇసుక సరఫరా జరిగితే ఇపుడు అది లక్ష టన్నులకు చేరుకుంది. అయినా చంద్రబాబు ఇసుక దీక్ష  చేయాల్సిందేనని గట్టిగా అంటున్నారు. ఆయన అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యలో జనసేన తరఫున టీడీపీకి మద్దతు ఉంటుందా అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


పవన్ ఈ నెల 3న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కి టీడీపీ మద్దతు ప్రకటించింది. దాంతోనే లాంగ్ మార్చ్ పూర్తిగా విజయవంతం అయిందని టీడీపీ అంటోంది కూడా ఇక ఏపీలో టీడీపీకి  మద్దతు ఎవరు ఇస్తారో పెద్దగా  అంచనా లేదు కానీ జనసేన నుంచి మద్దతు బాగానే ఉంటుందని ఆంటున్నారు. జనసేన లాంగ్ మార్చ్ కి మద్దతు ఇచ్చినందుకైనా  ఆ పార్టీ టీడీపీకి తన మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.


ఈ నెల 14న చంద్రబాబు విజయవాడలో నిర్వహించే ఇసుక పోరాట దీక్షకు పవన్ స్వయంగా హాజరవుతారా అన్న దాని మీద కూడా అసక్తికరంగా చర్చ సాగుతోంది. పవన్ హాజరైతే ఈ దీక్ష హైలెట్ అవుతుందని, మైలేజ్ కూదా బాగా వస్తుందని టీడీపీ వూహిస్తోంది. పవన్ సైతం చంద్రబాబు పక్కన కూర్చోవడానికి పెద్దగా అభ్యంతరపడకపోవచ్చునని అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉండడం ఒక ఎత్తు అయితే బాబుకు పవన్ ఎపుడూ మద్దతుగానే ఉంటాడని వైసీపీ లాంటి పార్టీలు అంటూనే ఉంటాయి. 


ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ సాగే ఈ దీక్షకు టీడీపీ  నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక బాబు తొలిసారి భారీ ఆందోళనకు పిలుపు ఇచ్చారు. ఆయన సైతం స్వయంగా  కూర్చుంటారు  కాబట్టి వైసీపీ మీద సమర శంఖారావంగా ఈ దీక్ష ఉండాలని భావిస్తున్నారు. దాంతో పవన్ కనుక వస్తే హైప్ బాగా వస్తుందని, అది హైలెట్ గా నిలుస్తుందని కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో ఏమో.


మరింత సమాచారం తెలుసుకోండి: