ఎల్వీ  సుబ్రమణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ హఠాత్తుగా బదిలీ మీద బాపట్ల మానవ వనరుల విభాగానికి బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి. జగన్ తోనూ, వైఎస్ కుటుంబంతోనూ మంచి రిలేషన్లు కలిగిన ఎల్వీ సుబ్రమణ్యం ఇలా అయిదు నెలల వ్యవధిలోనే కీలకమైన సీఎస్ పదవి నుంచి వేటు పడి వెనక్కురావడం రాజకీయ వర్గాల్లో షాకింగ్ పరిణామంగా చెప్పుకుంటున్నారు.  ఎల్వీ  ఇపుడు నెల రోజుల పాటు సెలవులోకి వెళ్ళారు.


ఇక ఎల్వీకి కేంద్రం మద్దతు ఉందని కూడా న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ఎన్నికల ముందు ఎల్వీకి కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది అంటే కేంద్రం ఆయన్ని పంపడం ద్వారానేన‌ని అంటున్నారు. జగన్ సైతం ఆయన్ని అక్కున చేరుకుని ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. అయితే తక్కువ టైంలోనే ఇద్దరి మధ్య‌న విభేదాలు వచ్చాయని అంటున్నారు.  ఇలా హఠాత్తుగా ఎల్వీని బదిలీ చేయడం, ఆయన హోదాని తగ్గించి డీగ్రేడ్ చేయడం పట్ల కేంద్రం గుస్సా మీద ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇపుడు ఎల్వీ పట్ల కేంద్రం సానుభూతితో ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీకి చెనెదిన బీజేపీ కీలకమైన నాయకుడు, ఎల్వీ సామాజికవర్గానికే చెందిన రాం మాధవ్ వంటి వారు కూడా ఎల్వీ విషయంలో మధనపడుతున్నారని అంటున్నారు.


ఈ నేపధ్యంలో ఎల్వీకి కేంద్రం కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుందని అంటున్నారు. ఆయన్ని కేంద్ర విజెలెన్స్ కమిషర్ గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఎల్వీ వంటి ముక్కు సూటి అధికారి సేవలను వాడుకోవాలని కూడా కేంద్రం భావిస్తోందట. మరో వైపు ఎల్వీ ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని కూడా అంటున్నారు. ఆయనకు ఏపీలో అయిదు నెలల సర్వీసు ఉంది. మరి అది పూర్తి అయ్యాక తీసుకుంటారా, రాజీనామా ఇప్పించి తీసుకుంటారా అన్నది చూడాలి. ఇక ఎల్వీ ఢిల్లీ వెళ్తే కేంద్ర పెద్దలకు ఏం చెబుతారు, వైసీపీ సర్కార్ అయిదు నెలల పాలన మీద ఆయన ఏమైనా  నివేదిక ఇస్తారా అన్నది కూడా రాజకీయ వర్గాలో చర్చగానే ఉంది. చూడాలి మొత్తానికి ఎల్వీ కనుక ఢిల్లీలో ల్యాండ్ అయితే మాత్రం రాజకీయాలో కొంతవరకూ ప్రకంపనలు స్రుష్టించినట్లేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: