ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆవేశాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో తెలుగుదేశం ఎన్డీయేతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ, జగన్ ని లోపలికి పంపించేస్తారు అంటూ సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో టీడీపీ నేతలు ఒకరకంగా పండగ చేసుకునే ప్రకటనలు చేశారు. అసలు వాస్తవాలు ఎలా ఉన్నాయి.... జగన్ ముద్దాయిగా ఉన్నారా లేదా అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఏ స్పష్టతా రాలేదనే చెప్పాలి.


అభియోగాలను తీర్పులనుకుని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు జగన్ ముఖ్యమంత్రి అయినా సరే వారి పంథా ను మాత్రం మార్చుకోలేదు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి ఇవే విమర్శలతో సందడి చేసి, అల్ప సంతోషులు అనిపించుకుంటున్నారు. అమిత్ షా పుట్టిన రోజు నాడు జగన్ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే ఆయన మాట్లాడటానికి వెళ్లారు... అమిత్ షా పిలవలేదు అని చెప్పడం గమనార్హం. ఇటీవల అక్రమాస్తుల వ్యవహారంలో వ్యవహారంలో వ్యక్తిగత హాజరు విషయంలో కోర్ట్ జగన్ పిటీషన్ ని కొట్టేసింది.


ఇక్కడి నుంచి టీడీపీ కార్యకర్తలు నేతలు సోషల్ మీడియా వేదికగా ఒకరకమైన పండగ వాతావరణం సృష్టించారు. కోర్ట్ తీర్పుని పదే పదే ప్రస్తావిస్తూ త్వరలోనే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది, బెయిల్ రద్దు చేయమని సిబిఐ కోరే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. సిబిఐ ఈ వ్యవహారంలో ఆచితూచి స్పందిస్తున్నా ఆవేశం ఆగని చంద్రబాబు ఆయన బ్యాచ్ లోని కొందరు వాళ్ల‌కు వాళ్లే తేదీలు మార్చుకుంటూ ప్ర‌చారం చేసుకుని ఆనందం పొందుతున్నారు.


ఓ విధంగా టీడీపీ వాళ్ల శున‌కానందం పొందుతున్న‌ట్టే అనుకోవాలి. జ‌గ‌న్‌ను న‌వంబర్ ఒకటిన అరెస్టు చేస్తారు, నవంబర్ 7 అరెస్టు చేస్తారు, 18 వ తారీఖు అరెస్టు చేస్తారు అంటూ తేదీలు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పిచ్చి అభిమానులకు వెర్రి అంటిస్తున్నారు. ఆవేశపడటం మినహా అక్కడ ఏమీ జరగదని రాజకీయ పరిశీలకులు మొత్తుకుంటున్నా సరే వీరు మారడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: