ఏపిలో జగన్ సర్కార్ నిరుద్యోగులకు చేయుత అందించడంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో మరో ఉద్యోగ నియమకానికి సంబంధించిన ప్రకటనను వెల్లడించింది. ఇప్పటికే ఏటా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం. దీనిలో భాగంగా జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న కీలక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.


విశాఖ జిల్లాలో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో అటవీ శాఖ సిబ్బంది కొరత ఎదుర్కొంటుందని.. దానిని అధిగమించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు  వెల్లడించారు.. ఇందుకు గాను ఈ పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా 2500 వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్ల ఆయన తెలిపారు.


ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతామని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.. ఇందుకోసం అటవీ అధికారులకు నూతన ఆయుధాలు, వాహనాలు అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.40 కోట్లు వాహనాల కోసం విడుదల చేసిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 60 టన్నుల ఎర్ర చందనం విక్రయించేందుకు కేంద్రం అనుమతి కూడా కోరినట్లు చెప్పారు.


ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఏపిలో పెను మార్పులు తీసుకువచ్చారు. దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగుల మొహాల్లో వెలుగు నింపాడు. తండ్రిలాగానే తనయుడు కూడా అదే తరహాలో పేరు తెచ్చుకుంటున్నాడు.. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట వరాలయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: