దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అసలు బాగాలేదు. దేశంలో ఏం జరుగుతున్న కాంగ్రెస్ నుండి పెద్ద స్పందన లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిని చూస్తుంటే బీజేపీ అన్నట్లు కాంగ్రెస్ ముక్త్ భారత్ మరికొద్ది రోజుల్లో నిజమయ్యే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. సోనీయా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత మీడియా కంటికి కనిపించకుండా పోయారు. ఈ నేపథంలో కాంగ్రెస్ ని ముందుండి నడిపించేవారు లేరనే అభిప్రాయం వినిపిస్తోంది.


ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీలోని  పెద్దలు కొద్దిరోజులుగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్తీ మనుగడ సాగించాలంటే సోనియా కుటుంబం నుంచే  నాయకుడు ఉండాలని అంటున్నారట. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాహుల్ గాంధీని ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ, అవేమీ ఫలించకపోవడంతో మరో వ్యక్తి కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం.


అయితే ఆ వ్యక్తి ప్రియాంకా గాంధీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మొన్న వచ్చిన అయోధ్య తీర్పులో కాంగ్రెస్ నాయకుల నుండి ఎలాంటి వ్యాఖ్యలు రాకూడదని ఆదేశాలు జారీ చేసారట. సాధారణంగా అలాంటి వ్యాఖ్యలు అధ్యక్షుడి దగ్గర నుండి వస్తాయి. అలాంటిది ప్రియాంక అన్నీ తానై చూసుకుంటుందన్న కారణంతో ఆమె అధ్యక్షురాలిగా కొనసాగితే బాగుంటుందని అనుకుంటున్నారట.


ఈ విషయమై ప్రియాంకని ఇంతకు ముందు అడగడం జరిగింది. అప్పుడు ప్రియాంక గాంధీ దానికి సుముఖంగా లేదు. దాంతో సోనియా గాంధీ తాత్కాలిక బాధ్యత్లు చేపట్టారు. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ యాక్టివేట్ గా లేకపోవడంతో ప్రియాంక గాంధీ ఆ బాధ్యతలని తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి ఆమె భర్త రాబర్ట్ కూడా సహకరిస్తున్నారని సమాచారం.  మరి ప్రియాంక అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉనికిని, భవితవ్యాన్ని  కాపాడుతుందా లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: