నేటి యువతను సెల్ఫీ పిచ్చి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఏం  ఆలోచిస్తున్న ఒక సెల్ఫీ క్లిక్ మనిపిస్తే చాలు అనుకుంటుంటారు  నేటి యువత. ఇక సెల్ఫీ దిగెందుకు  వేలకు వేలు పెట్టి మరి ఫోన్లు కొంటుంటారు. ఈమధ్య చౌక ధరలకే మంచి సెల్ఫీ కెమెరా ఫోన్లు వస్తుండడంతో ఈ సెల్ఫీ  పిచ్చి ఇంకాస్త ఎక్కువ అయిపోయింది. అందరిలా కాకుండా భిన్నంగా సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మరి ఇన్ని లైకులు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్నా తరుణంలో... ఈ సెల్ఫీ ల గోల కూడా ఎక్కువైపోయింది. ఏదో ఒక పిచ్చి ఎక్స్ ప్రెషన్ తో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే లైక్లు వస్తాయో ఆనంద పడతే  బానే ఉంటుంది కానీ ఆ సెల్ఫీలు కాస్త మన ప్రాణానికి ఆపద కలిగిస్తే డేంజరే  కదా. 



 అందరిలా కాకుండా డిఫరెంట్ గా సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని చాలా మంది భావిస్తారు.దీంతో  డిఫరెంట్ గా  సెల్ఫీ తీసుకుందామని కొన్ని రిస్కీ ప్లేస్ లకు వెళ్లి  ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సెల్ఫీ పిచ్చి మరో యువతి ప్రాణం తీసింది. ఆనందంగా సెల్ఫీ తీసుకున్న మన ఆ యువతి ప్రమాదవశాత్తు ప్రాణం కోల్పోయింది . దీంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన ధనలక్ష్మి అనే యువతి సెల్ఫీలు తీసుకోవడం అంటే చాలా ఇష్టపడుతుంది. 



 కాగా  ధనలక్ష్మి తాజాగా ఓ శుభకార్యానికి నకిరేకల్ మండలం కండ్లగుంట కు వెళ్ళింది. మార్గమధ్యంలో కండ్లగుంట బ్రాంచ్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగాలని అనుకుంది ధనలక్ష్మి. దీంతో కెనాల్ వద్దకు తన స్నేహితురాలితో కలిసి  వెళ్ళింది. కాగా  అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న  క్రమంలో ఇద్దరు ప్రమాదవశాత్తు కెనాల్ కాలువ లో పడిపోయారు. అయితే వీరిని గమనించిన స్థానికులు వెంటనే వీరిని రక్షించే ప్రయత్నం చేయగా ఒకరిని మాత్రమే రక్షించగలిగారు  స్థానికులు. మరో విద్యార్థి ధనలక్ష్మి మాత్రం కెనాల్ లో పడి మృతి చెందింది. దీంతో ధనలక్ష్మి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలకు సెల్ ఫోన్  ఇవ్వకండి... సెల్ ఫోన్  నా బిడ్డ ప్రాణం తీసింది అంటూ ధనలక్ష్మి తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: