ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం వివాదంపై జగన్మోహన్ రెడ్డి పవర్ ఫుల్ పంచ్ విసిరారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సిఎం చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సూటిప్రశ్నలతో  దుమ్ము దులిపేశారు.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టంటపై ఇంత రచ్చ చేస్తున్న పై ముగ్గురు తమ పిల్లలు లేకపోతే వారసులు ఏ స్కూళ్ళల్లో చదువుతున్నారో చెప్పాలంటూ నిలదీశారు. వాళ్ళ పిల్లలు, వారసులు మాత్రం మంచి ఇంగ్లీషు మీడియా స్కూళ్ళల్లోనే చదవాలా ? పేదల పిల్లలు మాత్రం చదవకూడదా ? అంటూ వేసిన సూటి ప్రశ్నకు వాళ్ళు ఏమని సమాధానం చెబుతారో చూడాల్సిందే.

 

ముందు చంద్రబాబు గురించి మాట్లాడుతూ కొడుకు నారా లోకేష్ ఏ స్కూల్లో చదివారో చెప్పాలన్నారు. అలాగే ఇపుడు మనవడు దేవాన్ష్ ఏ స్కూల్లో చదువుతున్నాడో చెప్పగలరా ? అంటూ నిలదీశారు. అలాగే జనసేన అధినేత గురించి మాట్లాడుతూ ’పవన్ కు ముగ్గురు భార్యలు..బహుశా నలుగురో లేకపోతే ఐదుగురో పిల్లలు కూడా ఉండే ఉంటారు. వాళ్ళంతా ఏ స్కూల్లో చదువుతున్నారో చెబుతారా ?’ అంటూ ప్రశ్నలు సంధించారు.

 

చివరగా వెంకయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ మీ కొడుకు ఎక్కడ చదివారు ? మీ మనవళ్ళు ఎక్కడ  చదవుతున్నాడో చెప్పగలరా ? అంటూ అడిగిన ప్రశ్న మరి వెంకయ్య ఏమని సమాధానం చెబుతారో చూడాల్సిందే. నిజానికి ఇంగ్లీషుతో పాటు తెలుగు మీడియం కూడా కంటిన్యు చేయమని అడగటంలో తప్పేమీ లేదు.

 

కానీ పై ముగ్గురితో పాటు ఎల్లొమీడియా అధిపతులు కూడా తెలుగు భాషకు జగన్ వల్ల పెద్ద ప్రమాదం వచ్చేసిందన్నట్లుగా రెచ్చిపోతున్నారు. జగన్ కు వ్యతిరేకంగా తమ మీడియాలో ప్రతిరోజు పుంఖాను పుంఖాలుగా కథనాలు ఇచ్చి గబ్బుపట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాన్నే జగన్ వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ స్ధాయిలో విద్యార్ధులు పోటీ పడాలంటే ఇంగ్లీషు నేర్చుకోవటం చాలా ముఖ్యమన్న ఉద్దేశ్యంతోనే తాము ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడదామని అనుకున్నట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: