ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ... రాష్ట్రం మొత్తం పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు లోకి వస్తాయి ఎలాంటి పాలన జరుగుతుంది అంటూ ప్రజలకు వివరించారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు విశేష ఆదరణ లభించింది. అయితే గతంలో ఎన్నికల ముందు వైస్  జగన్మోహన్ రెడ్డి చేపట్టిన  పాదయాత్ర గురుంచి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మిషిన్ క్విడ్ ప్రో కో మళ్లీ ప్రారంభమైందన్న  సంకేతాలు కనిపిస్తున్నాయని ట్విట్టర్లో ఆరోపించారు ఎమ్మెల్సీ నారా లోకేష్. 

 

 

 

 విలువైన ప్రభుత్వ ఆస్తులను కొట్టెయ్యడానికి జగన్ క్విడ్ ప్రో కొ  కంపెనీ ప్రణాళికలు రచిస్తున్నది  అంటూ విమర్శలు గుప్పించారు నారా లోకేష్. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓ యువకుడు అయ్యుండి  కూడా పాదయాత్ర చేస్తున్నపుడు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే జగన్ నడుస్తున్నప్పుడే  అనుమానం వచ్చింది అని తెలిపిన నారా లోకేష్... ఇప్పుడు ఆ అనుమానం నిజమైంది అంటూ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఓవైపు మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మిస్తూనే ... మరోవైపు ప్రభుత్వ స్థలాలు సర్వే పూర్తి చేశారని ఆరోపించారు. రోజుకు మూడు కిలోమీటర్లు మాత్రమే నడిచి మిగతా టైం మొత్తం ప్రభుత్వ స్థలాలు సర్వే పూర్తి చేయడం కోసం కేటాయించారంటూ  విమర్శలు గుప్పించారు నారా  లోకేషన్. 

 

 

 

 ఇప్పటికే వాలంటీర్ల  పేరుతో ఏడాదికి నాలుగు వేల కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించిన  నారా లోకేష్... మరోవైపు ప్రభుత్వ ఆస్తులు కూడా అమ్మేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడగా ఇసుక కొరత  సమస్యను  తీర్చే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: