భారతదేశంలోని ఐటీ కంపెనీలు ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. ఐటీ కంపెనీలు రానున్న మూడు నెలల్లో 10,000 నుండి 20,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీల రాక, మార్జిన్ల నిర్వహణ, అమెరికాలో నియామకాలు ఊపందుకోవడం ఉద్యోగాల తొలగింపుకు కారణమయ్యాయని తెలుస్తోంది. 
 
ఇన్ఫోసిస్, కోగ్నిజెంట్ లాంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులలో కోత విధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశాయి. మిగతా టాప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ 10,000 మంది ఉద్యోగులను, కాగ్నిజెంట్ కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీలు మాత్రం వార్షిక సమీక్ష, ఉద్యోగుల సామర్థ్యంలో భాగంగా ఉద్యోగాల తొలగింపు సాధారణంగా జరిగేదే అని చెబుతున్నాయి. 
 
ఐటీ కంపెనీలు 5 నుండి 8 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం. 20 లక్షల రూపాయలకు పైగా వార్షిక వేతనం అందుకునే ప్రాజెక్ట్ మేనేజర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆటోమేషన్ కూడా ఉద్యోగాల తొలగింపుకు ఒక కారణంగా తెలుస్తోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా అప్ డేట్ అవుతూ ఉండాలి. కొత్త కోర్సులు ఖాళీ సమయాల్లో నేర్చుకుంటూ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఐటీ ఉద్యోగ సంఘాలు మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగులను నష్టాల తగ్గింపు పేరుతో తొలగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటనలు చేయటంతో సాఫ్ట్ వేర్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: