ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా..?  ఐతే కాస్త జాగ్రత్తగా చేయండి..! మళ్లీ మళ్లీ అప్‌డేట్‌ చేయాలంటే కుదరదు..! ఆధార్‌ దుర్వినియోగానికి చెక్‌ పెడుతూ..  మార్పులు చేర్పులకు ఆంక్షలు విధించింది . 


ఆధార్‌కార్డులో తప్పులు జరిగినప్పుడు... సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐతే దీన్నే అలసుగా తీసుకొని కొందరు ఆధార్‌ను దుర్వినియోగం చేశారు. డేటాఫ్‌ బర్త్‌ను తమకు నచ్చినట్లు మార్చుకునేవారు. దీన్ని చెక్‌పెట్టేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది ఆధార్ సంస్థ ఉడాయ్. పుట్టిన తేదిని నచ్చినట్లు మార్చుకునే అవకాశం లేకుండా చేసింది ఆధార్‌.


కొత్త నిబంధనల ప్రకారం.. ఆధార్ కార్డులో డేటాఫ్‌ బర్త్‌ తప్పుగా ఉంటే ఒకసారి మాత్రమే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. జెండర్ విషయంలోనూ తగిన పత్రాలను చూపించి ఒకేసారి అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఎక్కువసార్లు మార్చుకోవాల్సి వస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి తగిన ధృవపత్రాలను చూపించాలి. మార్పునకు గల కారణాలను వివరిస్తూ ఉడాయ్‌కు లెటర్‌ రాయాలి. అభ్యర్థనలో నిజం ఉందని భావిస్తే.. అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.  అవసరమేతే.. దగ్గర్లోని ఆధార్‌ కార్యాలయం అదనపు సమాచారం కోరవచ్చు.  క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. ఆధార్‌ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే కొత్త నిబంధనలు తెచ్చామని చెప్పింది ఉడాయ్‌.


మొత్తానికి ఆధార్ సంస్థ ఉడాయ్.. ఆధార్ విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనివల్ల సదరు వ్యక్తులు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో తగు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసార మార్చుకునే నిబంధన పెట్టడం వల్ల ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. 


కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ను పదే పదే మార్చుకునే అవకాశం ఇక ఉండదు. ఇప్పటి వరకు చాలా మంది పరిస్థితులను బట్టి తమకు అనుగుణంగా పుట్టిన తేదీలను మార్చుకుంటూ వచ్చారు. ఇది గమనించిన ఉడాయ్ ఆ పరిస్థితికి చెక్ పెట్టింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: