ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి గల లాఖింపూర్ ఖెరీ ప్రాంతంలో జరిగింది. ఓ వరుడు తన ఫ్రెండ్స్ తో కలిసి మ్యారేజ్ బరాత్ లో ఇష్టం వచ్చినట్లు డాన్సులు వేస్తూ గొడవపడుతూ ఎలాగోలా చివరికి తన పెళ్లి వేదికకి చేరుకున్నాడు. తర్వాత పెళ్లి మండపంపైకి ఎక్కి ఆపై వధువు మేడలో పెళ్లి వరమాల వేసాడు. కొంతసేపటికి మండపం పైకి వచ్చిన వరుడు స్నేహితులు అతనిని కిందికి దిగి డాన్స్ చేయమన్నారు. దీంతో మండపం దిగిన వరుడు నాగినీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. క్రిందపడి దొర్లేస్తూ, పాముల మెలికలు తిరుగుతూ ఓ పెద్ద విచిత్రమే సృష్టించాడు. 


ఇందంతా చూస్తున్న వధువు కుటుంబీకులు అతనిని డాన్స్ చేయడం ఆపమని అడిగినందుకు, వారిపై ఈ వరుడు నోరు పారేసుకున్నాడు. ఈ విషయం వధువుకు తెలియడంతో ఆమె వెంటనే మండపాన్ని విడిచి వెళ్ళిపోయింది. వాడిని పెళ్లి చేసుకోనంటే చేసుకోనంటూ వధువు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. అక్కడ ఉన్న బంధువులు స్నేహితులు ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె మొండిగా చేసుకోననడంతో ఇది తెలుసుకున్న వరుడు వధువు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అక్కడ పెద్ద గొడవ అయింది. అది తెలుసుకున్న పోలీస్ రంగా ప్రవేశం చేయడంతో వధువు వరుడు కుటుంబీకులు కొంచెం శాంతించారు. 


పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అభ్యంతరం తెలిపారు ఇరువురు కుటుంబీకులు. పెద్దల సలహాలతో మా సమస్యలు మేం పరిష్కరించుకుంటాం అని వాళ్ళు పోలీసులకు చెప్పడంతో వాళ్ళు సైడైపోయారు. ఇక పెద్దలు చెప్పినట్లుగా... వధువు కుటుంబం ఇచ్చిన పెళ్లి కానుకలని.. వారికి జరిగిన నష్టానికి నవంబర్ 14 లోపు పరిహారం చెల్లిస్తామని వరుడు కుటుంబీకులు రాతపూర్వీకం తెలిపారు. వరుడు బాగా మద్యం సేవంచడం వలన అలా ప్రవర్తించాడని వధువు సోదరుడు చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: