ఏ విషయంలోనైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ బట్టే ఎవరైనా నడవాల్సి ఉంటుంది. కానీ అనవసరంగా లిమిట్ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కరెక్ట్ గా ఇదే పరిస్తితి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. తొలిసారి అధికార పీఠం అధిరోహించిన జగన్... పాలనలో ఎంత దూకుడుగా వెళుతున్నారో అంతా చూస్తున్నారు. ఆయన అధికార పీఠం ఎక్కిన ఐదు నెలల్లోనే అనేక పథకాలు, అనేక ప్రజా ఉపయోగ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ ఐదు నెలల పాటు జగన్ ప్రజలకు మేలు చేయడం కోసమే ఆలోచించారు. అందుకే ప్రతిపక్షాల జోలికి పోలేదు.


కానీ ఈ ఐదు నెలల పాటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ జగన్ ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చాలానే చేశాయి. ఇక వీటికి మంత్రులు, ఇతర నేతలు కౌంటర్లు ఇస్తూనే వచ్చారు. అయితే అవి అంత స్థాయిలో రీచ్ కాలేదు. దీంతో పరిస్థితులని నిశ్శబ్దంగా గమనిస్తూ వచ్చిన జగన్ డైరెక్ట్ గా తానే రంగంలోకి దిగేశారు. ఐదు నెలల్లోనే తాను ఇచ్చిన హామీలని దాదాపు అమలు చేయడంతో, ఇప్పుడు ప్రతిపక్షాలపై ఫోకస్ చేశారు. అందుకే తాజాగా టీడీపీ, జనసేనలకు కలిపి ఒకేసారి స్ట్రాంగ్ గా ఇచ్చేశారు. అది కూడా పిల్లకు ఎంతగానో ఉపయోగపడే చదువు విషయంలో.


ఇటీవల జగన్ ప్రతి పేద బిడ్డ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుని సంరక్షించుకుంటూనే ఇంగ్లీష్ మీడియంలోనే భోదన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై టీడీపీ, జనసేనలు నానా రచ్చ  చేస్తున్నాయి. తెలుగుని చంపేస్తున్నారంటూ పెడబొబ్బలు పెట్టేస్తున్నాయి. అయితే వారి విమర్శలని తిప్పికొట్టడంలో అధికార వైసీపీ నేతలు కొంచెం వెనుకబడి ఉండటంతో జగనే స్వయంగా రంగంలోకి దిగేశారు.


చంద్రబాబు మనవడిని ఏ మీడియంలో చదివిస్తున్నారు? ముగ్గురు పెళ్ళాలు ఉన్న పవన్ కల్యాణ్...ఆయన పిల్లలని ఇంగ్లీష్ మీడియంలో చదివించడం లేదా? పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తప్పా? అంటూ ఇద్దరికి గడ్డి బాగా పెట్టారు. ఈ విమర్శలు దెబ్బకు టీడీపీ, జనసేనలకు ఫ్యూజులు ఎగిరిపోయినట్లైంది. మొత్తానికి పాలనలో దూసుకెళుతున్న జగన్..రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించడం ఖాయంగా కనబడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: