రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీ కి ఇప్పుడు సమర్ధవంతమైన నేత చాలా అవసరం. ఇది ఎవ‌రో చెపుతోన్న మాట కాదు... ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్తున్న మాట. జగన్ సర్కార్ ని ఎదుర్కొవాలన్నా , జగన్ కు ధీటుగా రాజకీయం చెయ్యాలన్నా సరే ఇది చాలా అవసరం. యువనేతలు పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకి వయసు మీద పడటం, ఆయన పాత‌కాల‌పు ఆలోచనలు... జగన్ ని ఎదుర్కోలేకపోవడంతో పార్టీ ఇబ్బంది పడుతోంది. ఉద్యమాలు చేసే దూకుడు.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే అంశాలు లోకేష్ లో లేకపోవడం, ఆయన ప్రసంగాలు వినలేకపోవడంతో ఇప్పుడు కార్యకర్తలు యువనేతలు స‌రికొత్త నేత కావాల‌ని కోరుతున్నారు.


ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లోకేష్ సామర్ధ్యం లేదని అదే ఆయన అయితే ముందుకి నడిపిస్తారని అంటున్నారు కార్యకర్తలు. పార్టీలో కూడా ఆయనకు మంచి ఇమేజ్ ఉండటం కలిసి వస్తుందని అంటున్నారు. కానీ దీనికి లోకేష్ నుంచి మద్దతు రావడం కష్టంగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. రామ్మోహన్ నాయుడు కి ఇస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే ఆందోళన లోకేష్ లో వ్యక్తమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


అందుకే అధినేత చంద్రబాబుతో తన రాజకీయ గురువు, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావునే కొనసాగించాలని పార్టీకి అనుభవం అవసరమని చెప్పారట. ఇక ఇదే సమయంలో రామ్మోహన్ కి పదవి ఇస్తే యువనేతల్లో చీలిక వస్తుందని కొందరు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంటుందని ముందుగానే చంద్రబాబుకి హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారట లోకేష్. ఇక ఇది పక్కన పెడితే గల్లా జయదేవ్ కి పార్టీలో ఇమేజ్ పెరుగుతోంది. ఆయన కూడా మంచి వాగ్దాటి ఉన్న నేతే... రాజకీయంగా కూడా సమర్ధవంతుడే... అంత వ్యతిరేకతతో కూడా స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. దీనితో ఇప్పుడు లోకేష్ ఆయనతో కూడా దూరంగా ఉంటున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: