రాజకీయాల్లో ఒకే ఒక తప్పు నాయకుల జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తప్పు వల్ల నేతల రాజకీయ జీవితమే శూన్యమవుతుంది. కరెక్ట్ గా ఇదే పరిస్తితిలో ఏపీలోని టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా అనేక అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన వాటిని సరిగా ఉపయోగించుకోలేక రాజకీయ జీవితాన్నే ప్రమాదంలో పెట్టుకున్నారు. కాపు నాయకుల్లో ముఖ్యుడుగా ఉన్న సునీల్ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం తరుపున కాకినాడ ఎంపీగా పోటీ చేశారు.


అయితే ఆ ఎన్నికల్లో సునీల్ దాదాపు 2 లక్షల 90 వేలు ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. ఇక తర్వాత ప్రజారాజ్యం పరిస్తితి ఏమైందో అందరికీ తెలుసు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్తితి కూడా ఘోరంగా తయారైంది. దీంతో ఆయన జగన్ నేతృత్వంలోని వైసీపీలోకి వెళ్లారు. ఆ పార్టీ తరుపునే 2014 ఎన్నికల్లో మళ్ళీ అదే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేవలం 3431 ఓట్ల తేడాతో అప్పటి టీడీపీ అభ్యర్ధి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.


సరే ఓడిపోతే ఓడిపోయారు. వైసీపీలో ఉండి జగన్ కు అండగా నిలబడితే మంచిగా ఉండేది. కానీ చలమలశెట్టి అలా చేయలేదు. ఓడిపోగానే సైలెంట్ అయిపోయి మళ్ళీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఇక మొన్న ఎన్నికల్లో సునీల్ కాకినాడ ఎంపీగానే పోటీ చేసి అనామకురాలుగా ఉన్న వైసీపీ అభ్యర్ధి వంగా గీతా చేతిలో 25 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.


అసలు వంగా గీతా ఎవరో పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఆమె జగన్ గాలిలో గెలిచేశారు. అదే జగన్ గాలి సునీల్ ని చిత్తు చేసింది. ఒకవేళ సునీల్ పార్టీ మారకుండా వైసీపీలోనే ఉండి ఉంటే పరిస్తితి వేరుగా ఉండేది. కానీ టీడీపీలో చేరి ఓడిపోవడం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఒకే ఒక తప్పు సునీల్ రాజకీయ జీవితాన్ని శూన్యం చేసేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: