ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటలు వరుకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలని అది కూడా ప్రజలకు ఇబ్బంది లేని చోట అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

                           

ఆంధ్రాలో బార్ల సంఖ్య తగ్గించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రలో మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే.. ఇందుకు భిన్నంగా కేరళ ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. పోల్చడం కాదు కానీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మందుబాబులకు శుభవార్త చెప్పాడు. 

                          

 ఇంకా వివరాల్లోకి వెళ్తే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో మద్యం సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు అక్కడ పబ్ లను కూడా ప్రారంభించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా వీకెండ్ లో ఆటవిడుపుగా ఉండే పబ్‌లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

                         

పబ్స్ ఓపెన్ చేసే ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, వైన్ షాపుల ముందు ప్రజలు నిలబడకుండా సూపర్ మార్కెట్ తరహాలో వైన్ షాపులను తీసుకొస్తామని అయన అన్నారు. ఈ సూపర్ మార్కెట్ వల్ల వారికీ నచ్చిన మద్యాన్ని ఈ షాపులలో ఎంపిక చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో కేరళ ప్రజలు ప్రస్తుతం గాల్లో తేలుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: