బిగ్ బాస్ గేమ్ లో ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. హౌస్ లో మెంబర్స్ కూడబలుక్కుని ఒకర్ని బకరా చేసి నామినేట్ చేస్తారు. వారిని  బయటకు పంపించే బాధ్యత ఓట్లు వేసేవారిదైనా కూడా ఆ విధంగా ప్రభావితం చేసేది మాత్రం హౌస్ మేట్స్. ఇపుడు ఏపీలో కూడా బిగ్ బాస్ ఆట రంజుగా సాగుతోంది. ఏపీలో పొలిటికల్ స్పేస్ తీసుకుంటే ఖాళీ లేదు. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో భారీగా జాగా ఆక్రమిస్తే క్యాడర్ బేస్  చూసుకుని టీడీపీ గట్టిగానే ఫైట్ చేస్తోంది.


ఇక పవన్ కళ్యాణ్ కి ఇంకా పొలిటికల్  అప్పీల్ రాకపోయినా సినీ క్రేజ్ తో ఆయన బాగానే నెట్టుకువస్తున్నారు. తాను కూడా ఫోర్శ్ గా నిలబడాలని చూస్తున్నారు. మరో వైపు కేంద్రంలో అధికారం చూసుకుని బీజేపీ స్పేస్ లేకపోయినా ఎవరినో ఒకర్ని  ఎలిమినేట్ చేసైనా అందులోకి రావాలనుకుంటోంది. ఈ రాజకీయ సయ్యాటలో బలి అయ్యేది బకరా అయ్యేది ఎవరు అన్నది కొద్ది నెలల్లోనే తేలిపోతోందంటున్నారు. ఏపీలో సామాజికవర్గాలు, ప్రాంతాలు, పరిస్థితులు ఇవన్నీ బేరీజు వేసుకుంటే వైసీపీ ఒక్కటే ప్రత్యేకమైన జోనర్లో సేఫ్ గా ఉంది. కాంగ్రెస్ నుంచి మొత్తానికి మొత్తం ఓట్లను, సామాజిక వర్గాలను లాగేసిన వైసీపీ పటిష్టంగా ఉంది. వైసీపీ బేస్ చెదరాలంటే కాంగ్రెస్ పునరుజ్జీవం కావాలి. అంతవరకూ బెంగపడనవసరం లేదు.


ఇక టీడీపీ ఓటు బ్యాంక్, సామాజికవర్గాలు, ప్రాంతాలు అన్నీ కూడా బీజేపీ కి ఆశ కల్పిస్తున్నాయి. కష్టపడితే టీడీపీ స్పేస్ లోకి వచ్చేందుకు  బీజేపీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమ్మ సామాజికవర్గం డామినేషన్ రెండు పార్టీలో ఉంది. టీడీపీ కాకపోతే బీజేపీ అన్న ఆలోచనలో తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మరో వైపు జనసేన కూడా టీడీపీ ఓటు బ్యాంక్ మీదనే కన్నేసి రాజకీయం చేస్తోంది.  అయితే ఎలిమినేషన్ ప్రొసెస్ లో కాకుండా మంచిగా దోస్తీ  చేస్తూనే ఆ వర్గాలను తిప్పుకోవాలని పవన్ భావిస్తున్నారు. అయితే అందరిలో బీజేపీ వ్యూహాలు ఎక్కువగా ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉండడంతో టీడీపీని ఎలిమినేట్ చేసేందుకు బాగానే గేలం వేస్తోంది. ఈ మొత్తం గేమ్ ని  మాత్రం అధికార వైసీపీ హ్యాపీగా చూస్తోంది. ఎందుకంటే వారు కొట్టుకుని ఒకరు బయటపడితే వారే 2024లో వైసీపీకి ప్రతిపక్షం, ప్రత్యర్ధి వర్గం అవుతారు కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: