జాతీయ మీడియా, జాతి మీడియాను మ్యానేజ్ చేసి మరీ అభివ్రుధ్ధి రేట్ పెరిగిందని గొప్పలు చెప్పుకుంది తెలుగుదేశం సర్కార్. ఒక దశలో కేంద్రం కంటే కూడా ఎక్కువ ప్రగతి సాధించామని కూడా చెప్పుకుంది. ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలూ దివాళా తీశాయని, ఏపీ ఖజానాలో చిల్లి గవ్వ లేదని అనుకూల మీడియా దీర్ఘాలు తీయడమే అసలైన విడ్డూరం. 


మరి అంతా అరు నెల‌ల్లోనే ఊడ్చేశారా. నిధుల లేమికి కారణం ఎవరు, ఈ ప్రశ్నలకు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముఖంగా చెప్పిన మాటలు,  పెట్టిన గగ్గోలు చూస్తే అమ్మ పసుపు పార్టీ సర్కారోయ్  అనిపించకమానదేమో. ఏకంగా నలభై వేల కోట్ల రూపాయల‌ను సాంతం నాకేశారు. బిల్లులు మాత్రం మా నెత్తిన పెట్టి టీడీపీ పెద్దలు పోయారు అంటూ మంత్రి బుగ్గన చెప్పుకున్నారు.


ఏపీ ఖజానా దారుణంగా దెబ్బ తింది. ఇపుడు ఆదుకోవాల్సింది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. లేకపోతే గట్టెక్కలేమని ఆయన క్లారిటీగా చెప్పేసారు. కనీసం అప్పు చేద్దామన్న కూడా లేకుండా చేశారంటూ బాబు సర్కార్ మీద విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఢిల్లీలో కలసి ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా నిధులు ఇవ్వాలని బుగ్గన కోరారు.


ఇవన్నీ సరే ఏపీలో టీడీపీ కూనిరాగం తీస్తే ఢిల్లీలో కొండంత రాగంగా వినిపించే జాతీయ మీడియా ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని రాస్తుందా లేక ఇదంతా కూడా వైసీపీ సర్కార్ నెత్తిన రుద్దే కధనాలు రాస్తుందా. ఏమో. బుగ్గన ఏపీ ఆవేదన జాతీయ మీడియా ద్రుష్టికి బాగానే తెచ్చారు. పసుపు పార్టీ కలరింగుల రంగులను  కూడా బయటపెట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: