వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని ఇప్పటికే అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా మరో హామీని నెరవేర్చారు. అదేమంటే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. ఈ పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.


ఇకపోతే ఎక్కువ మంది నిరక్షరాస్యులు పొదుపు సంఘాల సభ్యుల్లో  ఉండటంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక పనులను వీవోఏ, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 27,797 గ్రామ సమాఖ్యలు, పట్టణ ప్రాంతాల్లో 8,034 ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్‌లున్నాయి. గ్రామ సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది వీవోఏలు, ఆర్పీలు పర్యవేక్షిస్తున్నారు.


ఇక 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెర్ప్‌లో పనిచేసే వీవోఏలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున చెల్లించే గౌరవ వేతనాన్ని రద్దు చేశారు. వారికి కనీసం గౌరవ వేతనం నిలిపివేస్తున్నట్టు సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ విషయమై 2015లో 27 వేల మందికిపైగా వీవోఏలు  ఏకంగా 75 రోజుల పాటు సమ్మె చేసినా కరుణించలేదు. అసలు వీవోఏలు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, రూపాయి కూడా గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.


ఇకపోతే 2019లో ఎన్నికలు రావడం, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో అప్రమత్తమైన చంద్రబాబు సర్కారు వీవోఏలకు ప్రభుత్వం నుంచి రూ.3 వేలు, గ్రామ సమాఖ్య నుంచి మరో రెండు వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని అధికారం కోల్పోయే సమయంలో గత్యంతరం లేక హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీలకు నామమాత్రంగా గౌరవ వేతనం చెల్లించేందుకు అంగీకరించింది.


ఇకపోతే వైఎస్‌ జగన్‌ 2018 జూలై 15న తూర్పు గోదావరి జిల్లాలో తనను కలిసిన వీవోఏ, ఆర్పీలకు వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే రూ.పది వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉద్యోగ వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: