గత మూడు దశాబ్దాల వివాదానికి తాజాగా సుప్రీం కోర్టు   తెరదించిన విషయం తెలిసిందే . ఐదు గురు  సభ్యులతో కూడిన  అత్యున్నత ధర్మాసనం... వివాదాస్పదమైన అయోధ్య కేసు విషయంలో కీలక తీర్పును వెలువరించింది. గత మూడు పదుల సంవత్సరాల నుండి సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తున్న అయోధ్య కేసు పై సంచలన తీర్పును వెలువరించింది. అయోధ్య భూభాగం హిందువులకు చెందుతుందని తెలిపిన సుప్రీంకోర్టు హిందువులకు చెందిన న్యాస్ కు వివాదాస్పద భూభాగాన్ని అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ముస్లింలకు బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని సున్ని వక్ఫ్ బోర్డుకు  కేటాయించాలని సూచించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  దేశమంతా  హర్షధ్వానాలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీప్  అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

 

  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నాను కానీ సుప్రీంకోర్టు పొరపాటు చేయదని లేదు  కదా అంటూ కామెంట్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ. సుప్రీంకోర్టు తీర్పుతో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తనకు అసంతృప్తినే మిగిల్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేయకపోతే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇలాంటి  తీర్పు ఇచ్చేది కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్ని  వక్ఫ్  బోర్డ్ కి భూమిని కేటాయించాలని సుప్రీం తీర్పుపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ తమకు సానుభూతి అవసరం లేదు దానం  అక్కర లేదని తేల్చి చెప్పారు. తమ  పోరాటం భూమి కోసం కాదని న్యాయం కోసం అంటూ తెలిపారు. 

 

 

 ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో  అసదుద్దీన్ పై మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివాదాస్పద అయోధ్య భూభాగంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పై  అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మధ్యప్రదేశ్ కు చెందిన న్యాయవాది పవన్ కుమార్ యాదవ్ జాంగిర్బాద్  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పవన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: