క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జాతీయ మీడియా కూడా చంద్రబాబునాయుడు ఉచ్చులో ఇరుక్కున్నట్లే కనబడుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా జాతీయమీడియా ఏకపక్షంగా వత్తాసు పలుకుతుండటం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. వైఎస్ కుటుంబానికి చంద్రబాబుకు మధ్య వైరం ఈనాటిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

తప్పుడు వార్తలు, కథనాలు ప్రచురించిన మీడియాపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన 2430 జీవో పై జాతీయ మీడియా రెచ్చిపోతున్న విషయమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలు రాసిన వాళ్ళపై చర్యలు తీసుకుంటామని మాత్రమే చెబుతోంది. ఇంతమాత్రానికే ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ లాంటి అనేక సంస్ధలు జగన్ చర్యలను తప్పుపట్టటమే విచిత్రంగా ఉంది.

 

2014 నుండి చంద్రబాబు-ఎల్లోమీడియా బంధం మరింత బలపడటంతో  జగన్ పై వ్యతిరేకంగా అడ్డదిడ్డమైన వార్తలు, కథనాలు ఎక్కువైపోయాయి. అయితే  ఎంత అండగా ఉందామని అనుకున్నా మొన్నటి ఎన్నికల్లో ఎల్లోమీడియా రక్షణ సాధ్యం కాలేదు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా మాయను జనాలు ఛేదించి టిడిపి గూబగుయ్యిమనిపించారు.

 

ఎప్పుడైతే జాతి మీడియా ప్రభావం పనిచేయలేదో వెంటనే చంద్రబాబు జాతీయ మీడియాను రంగంలోకి దింపేశారు. వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాయిస్తు జాతీయస్ధాయిలో జగన్ ను గబ్బుపట్టించే కార్యక్రమం మొదలైంది. కరకట్ట మీద చంద్రబాబు అక్రమనివాసం గురించి తెలుసో తెలీదో కానీ జాతీయమీడియా మాత్రం రెచ్చిపోయింది. చలో ఆత్మకూరు కార్యక్రమంలో చంద్రబాబును పాల్గొననీయకుండా ప్రభుత్వం అడ్డుకుంది.

 

అక్రమనివాసం ముందు భారీగా పోలీసులు మోహరించటాన్ని ఇంటి ముందునుండే జాతీయమీడియా లైవ్ టెలిక్యాస్ట్ ఇచ్చేసింది. ఏ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపిస్తే అంగీకరించవు. ఇదే పద్దతిలో వైసిపి ప్రభుత్వం కూడా చంద్రబాబును అడ్డుకుంది. ఇంతమాత్రం ఇంగితం లేని జాతీయమీడియా పదే పదే జగన్ ను తప్పుపట్టటమే ఆశ్చర్యమేసింది. అసలు కరకట్ట మీద చంద్రబాబు అక్రమంగా ఎలా నివాసముంటున్నారన్న విషయాన్ని ఒక్క మీడియా కూడా ఆలోచించకపోవటమే విచిత్రం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: