ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనాల మీద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సీఎం జగన్ ఎన్నో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. 


అదేంటంటే.. వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెంచినట్టు, డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అధికారులు, కలెక్టర్లతో సమీక్షా నిర్వహించిన మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం బోస్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని గడువు పెంచినట్టు మంత్రి తెలిపారు. 


అయితే కౌలు రైతులకు మాత్రమే ఈ గడువు పెంచారు.. మిగిలిన రైతులకు ఈనెల 15 వరకు మాత్రమే అవకాశం ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు పథకం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది అని అయన అన్నారు. అంతేకాదు రైతు భరోసాకు సంబంధించి.. మూడు రోజుల పాటూ ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని.. తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. 


రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్పందన నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతవారం నిర్వహించిన ప్రత్యేక స్పందనలో 2.89 లక్షల అర్జీలు వచ్చాయని.. వీటిని పరిష్కరించే పనిలో ఉన్నామని అన్నారు. కాగా సీఎం జగన్ కూడా రైతు భరోసా అర్హులైన ప్రతి రైతుకు అందేలా చూడాలని.. రైతు భరోసా పథకం అందలేదన్న విమర్శ రాకూడదని సీఎం జగన్ కూడా అన్నారు. ఏది ఏమైనా ఈ వార్త కౌలు రైతులకు శుభవార్త అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: