సినిమా హీరోలకు మహిళా అభిమానులు ఎక్కువగా  ఉండటం కామనే . ఇక బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ లాంటి హీరోలకు అయితే... మహిళా వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఎంతలా అంటే వాళ్లకి  హృతిక్ రోషన్ లాంటి హస్బెండ్ వస్తే ఎంత బాగుండు అన్నంత వీరాభిమానులు ఉన్నారు. అయితే ఇక్కడ ఓ మహిలా ఈ విధంగానే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కీ  వీరాభిమాని. ప్రతి నిమిషం ప్రతి క్షణం హృతిక్ రోషన్  గురించే  ఆలోచిస్తుంది. కానీ ఈ అభిమానమే ఆ మహిళ ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమెను కిరాతకంగా చంపాడు. ఏం జరిగిందో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

 

 

 3 ఏళ్ళ పాటు  ప్రేమలో మునిగితేలిన దినేశ్వర్,  డోన్నే డోజోయా  అనే జంట ఇండియాలో వివాహం చేసుకుని ఆ తర్వాత అమెరికాకు వెళ్లి పోయారు.క్వీన్స్  ప్రాంతంలోని ఓజోన్  రోడ్ లోని జెమిని  అల్ట్రా లాంజ్ లో బార్లో  డోజోయ్  ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే డోజోయ్   హృతిక్ రోషన్  వీరాభిమాని. ప్రతి విషయంలో హృతిక్రోషన్ ఊసే ఎత్తేది ఈ మహిళ. నిద్ర వచ్చేంతవరకు హృతిక్ రోషన్ సినిమాలు చూస్తూ గడిపే ఈ  మహిళ... పడక గదిలో నిద్రపోతున్నప్పుడు  కూడా హృతిక్ రోషన్ నే  కలవరిస్తూ ఉండేది. ఈ విషయమై భర్తతో తరచూ గొడవలు కూడా పడుతుంది ఆ మహిళ. 

 

 

 

 బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో తన భర్తను పోలుస్తూ... అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ భర్తకు చెప్పేది.. అయితే భర్త దినేష్ కు మాత్రం తన భార్య వైఖరి నచ్చేది కాదు. అయితే కొన్ని రోజులపాటు భార్య వైఖరిని చూసి సహించిన  భర్త ఆ తర్వాత కోపోద్రిక్తుడై  భార్యను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీనిపై సదరు  మహిళా పోలీసులను ఆశ్రయించింది. దినేశ్వర్  భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేశ్వర్ ను  అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత అతను విడుదలయ్యాడు. భార్య మీద తీవ్రమైన ఆగ్రహం తో ఇంటికి వచ్చిన దినేష్ భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత దినేశ్వర్  కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: