ప్రశాంత్‌ కిషోర్‌ ఒక రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన వ్యక్తి.ఈ మధ్య  ప్రశాంత్‌ కిషోర్‌ నటుడు విజయ్‌కు ముఖ్యమంత్రి ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు రాజకీయ వ్యూహకర్తగా  ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌లకు పని చేశారు. దీంతో తమిళనాడుకు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ పేరు  పాకింది. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు 2021లో  జరగనున్న విషయం తెలిసిందే.

దీంతో తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు ప్రశాంత్‌ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే ఈయన మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు ప్రశాంత్‌ కిషోర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను  విభేదించడమే అందుకు కారణం అని తెలిసింది.

దీంతో  మక్కళ్‌ నీది మయ్యం ఒప్పందం ప్రశాంత్‌ కిషోర్‌తో  రద్దు కానున్నట్లు సమాచారం. ప్రశాంత్‌ కిషోర్‌ను  రజనీకాంత్‌ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవాలని  భావిస్తున్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. ప్రశాంత్‌ కిషోర్‌  ఇలాంటి  సమయంలో దళపతి విజయ్‌ను రాజకీయాల్లోకి  తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.  ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన బృందం రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి సమగ్ర సర్వే నిర్వహిస్తుందట. తమిళనాడులో చేసిన సర్వేలో నటుడు విజయ్‌ పేరును చేర్చారట.


అలా విజయ్‌కు 28 శాతం ప్రజలు ఆదరణ తెలిపారట. కాగా ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ నటుడు విజయ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. అప్పుడు తాము నిర్వహించిన సర్వే వివరాలను, ఆయనకు 28  శాతం మంది ప్రజల మద్ధతు తెలిపిన విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అంతే కాదు రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని గెలిపించడానికి తాము వ్యూహ రచన చేస్తామని తెలిపినట్లు తెలిసింది. అందుకు ఏడాది పాటు అనుసరించాల్సిన పథకాల గురించి వివరించినట్లు సమాచారం. వీటన్నిటిని చేస్తే  మీరే కాబోయే సీఎం అని ఆశలు రేకెత్తించినట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: