ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి రాజధాని అమరావతి నిర్మించింది. రాజధాని నిర్మాణం కోసం ఎన్నో వేల ఎకరాల ను సేకరించే అధునాతన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోని అమరావతి రాజధాని లోని 1691 ఎకరాల్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టార్టప్  ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం సింగపూర్ కంపెనీతో  ఒప్పందం కూడా కుదుర్చుకుంది గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం . కాగా రాజధానిలో స్టార్టప్  ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తాజాగా సింగపూర్ వైదొలుగుతున్నట్లు  ప్రకటించారు. 

 

 

 

 ఏపీ ప్రభుత్వం సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతోనే ఈ స్టార్టప్  ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్  స్పష్టం చేసారు. స్టార్టప్  ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెతాయని తెలిపిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్...  అందువల్లే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు నిన్న రాత్రి ఏపీ ప్రభుత్వం తమకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు ఆయన. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో స్టార్టప్  ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ కన్సార్షియం తప్పుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. 

 

 

 

 అయితే గత ప్రభుత్వ హయాంలో 1691 ఎకరాల్లో  స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం  దీనిపై 2017 లో సింగపూర్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఈ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపబోదని  అంటూ  సింగపూర్ మంత్రి ఈశ్వరున్  స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో  సింగపూర్ కంపెనీ పెట్టిన పెట్టుబడులపై... దీని ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన ప్రకటనలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: