ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. రెండు రోజుల్లో భారీ కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మిం చాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే అనేక రూపాల్లో ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ఆదిలో అన్నా కేంటీన్ల‌ను ర‌ద్దు చేయ‌డం, త‌ర్వాత టీడీపీ త‌మ్ముళ్ల‌పై దాడులు, ఆత్మ‌కూరు ఘ‌ట‌న వంటి వాటిపై ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆందోళ‌న‌లకు కూడా పిలుపునిచ్చారు. ఇక‌, కృష్ణా, గోదావ‌రి వ‌ర‌ద‌లు, త‌న ఇంటిని కూల్చేందుకు కుట్ర వంటివాటిపైనా రాష్ట్ర స్థాయిలో ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. అదే క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పెను స‌మ‌స్య‌గా మారింద‌ని పేర్కొంటూ.. ఇసుక విష‌యంపై గ‌డిచిన  రెండు వారాలుగా చంద్ర‌బాబు ఉద్య‌మాలు చేస్తున్నారు.


అయితే, ఇసుక ఉద్య‌మం విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విశాఖ‌లో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. చంద్ర‌బాబు అండ్‌కోలు ఎన్ని ఉద్య‌మాలు చేసినా.. రాని ప్ర‌చారం ఒక్క ప‌వ‌న్‌కు ఒకే ఒక్క లాంగ్ మార్చ్‌తో వ‌చ్చి ప‌డింది. దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు.. ఇదే రేంజ్‌లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మాజీ సీఎం హోదాలో జాతీయ స్థాయిలో మ‌ళ్లీ తాను పుంజుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ నెల 14న ఇసుక దీక్ష‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మాన‌సికంగా ఈ దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు. అదేస‌మయంలో హైద‌రాబాద్ నుంచి వైద్యుల‌ను పిలిపించుకుని త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌రీక్షించుకుని అంతా ఓకే చేయించుకున్నారు.


ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. చంద్ర‌బాబు వ్యూహం కూడా అంద‌రికీ అర్ద‌మైంది. ఈ ఇసుక దీక్ష ద్వారా చంద్ర‌బాబు ఏం ఆశిస్తున్నార‌నే విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మైంది. అయితే, ఒక్క టీడీపీ త‌మ్ముళ్ల‌కు త‌ప్ప‌! అనే ప్ర‌చారం జ‌రుగుతోంది!! ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు సోష‌ల్ మీడియా నెటిజ‌న్లు. దీనికి కార‌ణం ఏంటంటే.. చంద్ర‌బాబు ఇసుక దీక్ష‌ను తొలుత విజ‌య‌వాడ‌లోని ఇందిరా పార్కు(దాదాపు ల‌క్ష మందిప‌డ‌తారు)లో చేయాల‌ని అనుకున్నారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌హ‌జంగా నే అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇక్క‌డ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం త‌ప్ప మ‌రేమీ చేయ‌డానికి వీల్లేద‌ని పోలీసులు తెగేసి చెప్పారు. మ‌రి దీంతో చంద్ర‌బాబు చేస్తున్న దీక్ష‌కు మ‌రేదైనా కీల‌క ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన త‌మ్ముళ్లు..


పోయి పోయి.. విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్‌(అత్యంత ర‌ద్దీగా ఉండే అలంకార్ సెంట‌ర్‌.. ఇక్క‌డ కేవ‌లం ప‌ది వేల మంది వ‌స్తేనే పూర్తిగా నిండిపోతుంది)ను ఎంపి క చేశారు. ఏర్పాట్లు కూడా రెడీ చేస్తున్నారు. అయితే, దీనిపై స్థానిక ప్ర‌జ‌లే కాకుండా విష‌యం తెలిసిన టీడీపీ అభిమానులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసి.. బాబు స్థాయిని త‌గ్గిస్తారా? అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయినా కూడా ఇవేమీ ప‌ట్ట‌న‌ట్టుగా తమ్ముళ్లు ఇక్క‌డే ఏర్పాట్ల‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. ఇక్క‌డ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌నట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: