మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. శివసేన పార్టీలో నలుగురు నేతలకు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ నలుగురిలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు.

ఆదిత్య ఠాక్రే (ఉద్ధవ్ కుమారుడు)ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు శివసేన నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ముంబయిలో కొన్ని చోట్ల మాత్రం ఉద్ధవ్ సీఎం కావాలంటూ కొత్తగా పోస్టర్లు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.ఇప్పటివరకూ ఠాక్రే కుటుంబం నుంచి ఎవరూ ప్రభుత్వంలో పదవులు చేపట్టలేదు.


అయితే, ప్రభుత్వంలో లేకపోయినా, ఉద్ధవ్ అనుకున్నది చేయించగలరు. ఉద్ధవ్‌కు పాలనాపరమైన అనుభవం అసలే లేదు. అయితే, సీఎం పదవి చేపట్టేందుకు ఇది అడ్డు కాదని, ఇందుకు చాలా ఉదాహరణలున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేవేందర్ ఫడ్నవీస్‌ కూడా సీఎం కాకముందు పెద్ద పదవులేమీ చేపట్టలేదు. నాగ్‌పూర్ మేయర్‌గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది.ప్రధాని పదవి చేపట్టేముందు రాజీవ్ గాంధీ పరిస్థితి కూడా ఇలాంటిదే



.ఆదిత్య ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. ఆయన ఫొటో, దాని కింద 'నా ఎమ్మెల్యే.. నా ముఖ్యమంత్రి' అన్న క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్లు నవంబర్‌ మొదటి వారంలో ముంబయిలో చాలా చోట్ల కనిపించాయి.బీజేపీతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఆదిత్య ఠాక్రేకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.యువకుడు కావడం, అందరితో కలిసిపోయే స్వభావం ఆదిత్యకు ఉపకరిస్తాయని శివసేనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు అంటున్నారు.


ఆదిత్య ఠాక్రే పార్టీలో క్రియాశీలంగా మారినప్పటి నుంచి వాలెంటైన్స్ డే వంటి వేడుకలకు శివసేన నుంచి వ్యతిరేకత తగ్గింది.అయితే, శివసేనపై బహిరంగ దాడికి దిగడం బీజేపీకి అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.ఠాక్రే కుటుంబ సభ్యులు కాకుండా, ముఖ్యమంత్రి పదవి రేసులో శివసేన నాయకులు ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్ పేర్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: