రాజకీయల్లో దిట్టగా  మంచి పేరున్న ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా తెలియచేయవలసిన అవసరం లేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గత కొన్ని నెలల ముందు నాటి ప్రతిపక్ష వైసీపీకి ఎన్నికల  బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కిశోర్... వైసీపీ భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ పార్టీ ఎన్నికల హామీలైన నవరత్నాలతో పాటు అభ్యర్థుల ఎంపిక వరకు ప్రశాంత్ కిశోర్ కీలక  పాత్ర పోషించడం జరిగింది. ఇటీవల  ఆయన తమిళనాడులో కోలీవుడ్ హీరో కమలహాసన్‌ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరిస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం కొనసాగుతుంది.


ఇక తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే కదా.  అయితే ప్రశాంత్‌ కిషోర్‌కు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు కూడా ప్రచారం ఉంది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను కమలహాసన్‌ విభేదించడమే అందుకు కారణం అని కూడా తెలిసింది. ఈ కారణంతో ప్రశాంత్‌ కిషోర్‌తో మక్కల్ నీది మయ్యం ఒప్పందం రద్దు కానున్నట్లు సమాచారం. కాగా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్న రజనీకాంత్‌ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకోవాలని అనే భావనలో ఉన్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు కూడా వార్తలు వినిపిసితున్నాయి.


ఇంకోవైపు తమిళనాడులో పొలిటికల్‌గా రజినీకాంత్ కంటే హీరో విజయ్‌కే ఎక్కువగా ఉందని పీకే సర్వేలో కూడా తేలింది... ఇదే విషయాన్ని ఆ స్టార్ హీరోకు ఆయన స్వయంగా కలిసి తెలిపారు అనే టాక్  కూడా వచ్చింది.ఇక మొత్తానికి ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడంలో కీలక పాత్ర పోషించిన పీకే... తమిళనాడులో మరో పొలిటికల్ స్టార్‌ను తయారు చేస్తాడో లేదో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: