జగన్ చంద్రబాబు ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలు. వారిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నది రాజకీయం తెల్సిన వారికి అర్ధమయ్యే విషయమే. ఇక బాబుకు జగన్ ఎక్కడ దొరుకుతాడా అన్నదే కావాలి. దొరకకపోయినా దొరికినట్లుగానే చేసేసి అల్లరి చేయడానికి కూడా బాబు ఎపుడూ రెడీగా ఉంటారు. మరి అటువంటి బాబు జగన్ విషయంలో అలా ఎందుకు వ్యవహరించారు..?


ఆయన ఒక్కరు తప్ప వైసీపీకి చెందిన ముఖ్యులు, మంత్రులు, పెద్ద తలకాయలందరినీ ఇసుకాసురులను టీడీపీ చేసేసింది.  ఆఖరుకు స్పీకర్ తమ్మినేని సీతారాంని కూడా  అసలు వదలేదు. ఆయన కూడా ఇసుక అక్రమార్కుడుట. ఆయనతో పాటు మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, జక్కంపూడి రాజా, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పార్ధసారధి, ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతం రెడ్డి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి,  రోజా సహా మొత్తం అరవై మంది పేర్లతో ఇసుకాసురులు అంటూ టీడీపీ పెద్ద లిస్ట్ తయారు చేసింది.


వీరందరికీ ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఇసుక అక్రమ రవాణా చేయిస్తూ ఏపీలో ఇసుక కొరతకు కారణమవుతున్నారని ఆరోపించింది టీడీపీ. వీరి మీద చార్జిషీట్లు వేస్తున్నట్లుగా పేర్కొంది. మొత్తానికి అందరి పేర్లు పెట్టిన చంద్రబాబు జగన్ మీద ఎందుకో ప్రేమ చూపారని సెటైర్లు పడుతున్నాయి. మాటకు వస్తే జగన్ని ఆడిపోసుకునే చంద్రబాబు ఇసుక మాఫియా విషయంలో కూడా జగన్ పేరుని ఇరికించి పండుగ చేసుకోవచ్చుకదా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. 


మరి ఎందుకు జగన్ని బాబు వదిలేశారో ఆ ప్రేమ వెనక ఏ రాజకీయ కారణాలు ఉన్నాయో చూడాలి. ఏది ఏమైనా ఇసుక మాఫియా అంటూ ఇంతకాలం టీడీపీని వైసీపీ నేతలు విమర్శిస్తూంటే అదే ఇసుక మాఫియా బురదను ఇపుడు టీడిపీ జల్లుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకూ ఉన్నాయో, వాటి కధ ఏంటో రాజకీయ వెండితెర మీదే  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: