ప్రక్రుతి ప్రసాదమైన వాటిలో  గాలి నీరు, భూమి, ఎండా, వెన్నెలా ఇలా చెబుతారు. మరి  ఇందులో  నీటికి ఎపుడో  కష్టాలు వచ్చిపడ్డాయి. నీరు ఒకపుడు ఉచితం. ఇపుడు నీటి కోసం యుధ్ధాలే జరుగుతున్నాయి. నీరు కొనుక్కునే రోజులు  దశాబ్దాలుగా  వచ్చేశాయి. నీటి గండాలతో మానవాళి చచ్చిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక భూమి విషయంలో కూడా ఇపుడు మాఫియాలు తయారయ్యారు. ఒకనాడు భూమి కూడా ఉచితమే. ఆ సంగతి తెలిస్తే ఇపుడు ఆశర్యపోతారు.


కాలగమనంలో మానవాళి పెరిగి పెద్దదై అవాసాలకు, ఆహారాలకు గిరాకీ అధికమై  భూమికి కూడా ఒక రేటు కట్టేశారు. ఇపుడు గజం జాగా కూడా ఖాళీగా ఉంచకుండా దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇపుడు గాలి కూడా కొనుక్కునే దౌర్భాగ్య రోజులు వచ్చేశాయి. దానికి దేశ రాజధాని ఢిల్లీ ఉదాహరణ. ఢిల్లీలో కాలుష్యం దారుణంగా ఉంది. అది మానవుడు పీల్చే గాలిని కూడా క‌బలిస్తోంది. స్వచ్చమైన గాలి కోసం ఢిల్లీ పౌరులు అర్రులు చాస్తున్నారు. నాణ్యతతో కూడిన నీటి గురించి వింటున్నాము. రక్షిత మంచినీరు పధకాలు ఎపుడో ప్రారంభించుకున్నాం. ఇపుడు ఆ జాబితాలోకి రక్షిత గాలి చేరుతోదంటే మన ఘనత ఎంత గొప్పదే వేరే చెప్పనవసరం లేదుగా. ఢిల్లీ పరిసర ప్రాంతాలో గాలి నాణ్యత నానాటికీ తగ్గిపోయి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.


 
ఈ రోజు ఢిల్లీతో పాటు, ఫరీదాబాద్, నోయిడాల్లో పొగతో కూడిన వాతావరణంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కంటి సమస్యతో పాటు నానా రకాలుగా అవస్థలకు గురి అవుతున్నారు.  ఇక ఢిల్లీలో సరి బేసి విధానం అమల్లో పెట్టినా  కూడా పెద్దగా మార్పు రాలేదని అంటున్నారు. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గడ్డి, పంట అవశేషాలు తగులపెట్టడమే వాయు కాలుష్యానికి కారణమని కూడా  అంటున్నారు


ఇంకో వైపు స్వచ్చమైన గాలి పావుగంట పాటు పీల్చుచుకోవచ్చంటూ అమ్మకానికి కొన్ని కంపెనీలు ఢిలీలో లాబ్స్ ఏర్పాటు చేయడం విశేషం. పావుగంట గాలి పీల్చుకోవడానికి వేల‌ల్లోనే సొమ్ము ఇవ్వాల్సివుంటుంది. మరి ఇది చాలదా గాలి ఎంత ఖరీదు అయిపోయిందో. నిజంగా ఆ పరిస్థితి వస్తే మానవుడు ఒక్క క్షణం ఈ భూమి మీద బతికిఉండడం కష్టం. దీన్ని గుర్తు పెట్టుకుని ఢిల్లీ హెచ్చరికలను మనసులో పెట్టుకుని మిగిలిన నగరాలు కూడా కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు ఇప్పటినుంచే తీసుకోవాలి. లేకపోతే గాలి కూడా అమ్మకానికే వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: