వైసీపీలో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ కొంత మంది నేతలు చంద్రబాబును టార్గెట్ చేయడంలో దిట్ట. అయితే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. బాబు గారి మీద ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. చిత్తూరు జిల్లాపై ఆధిపత్యం కోసం ఎన్నోసార్లు చంద్రబాబు పెద్దిరెడ్డిల మధ్య వార్ నడిచింది. అయితే చంద్రబాబు చాలా సార్లు సీఎంగా  అధికారంలో ఉండడంతో పెద్దిరెడ్డి పై ఆధిపత్యం చెలాయించారు. ఆయనను అణగదొక్కారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది... జగన్ కేబినెట్ లో పెద్దిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించడం.. మొన్నటి ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పం సీటు తప్ప అన్నింట్లోనూ వైసీపీ అభ్యర్థులను పెద్దిరెడ్డి గెలిపించి చంద్రబాబును చావుదెబ్బ కొట్టారు.


చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడా బాబును భయపెట్టారు.  పెద్దిరెడ్డి అధికారంలో ఉండడం.. మంత్రిగా ఉండడంతో ఇప్పుడు చిత్తూరులో తన రాజకీయ శత్రువైన చంద్రబాబు పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న ప్రచారం సాగుతోంది.. ఆ భయంతోనే చంద్రబాబు ఏకంగా మూడు రోజుల పాటు ఇటీవల చిత్తూరు జిల్లాలో పార్టీ సమీక్ష పెట్టి నేతలకు భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. అయితే తాజాగా టీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే డీకే  సత్యప్రభను వైసీపీలో చేర్చేందుకు పెద్దిరెడ్డి స్కెచ్ గీశారు.


డీకే  సత్యప్రభ చిత్తూర్ లో మంచి లీడర్. ఇప్పుడు ఆమె కూడా వైసీపీలోకి వెళితే చిత్తూరులో బాబు పరిస్థితి అంతే. ఇటీవల ఆమె ఇంట్లో శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి పూజల కార్యక్రమంలో  వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి పెద్దిరెడ్డి వెళ్లి పాల్గొనడం టీడీపీ అధినేతను షాక్ కు గురిచేసింది. ఆమె వైసీపీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.మొన్నటి ఎన్నికల వేళ సత్యప్రభ సీటును మార్చి చంద్రబాబు రాజంపేట ఎంపీగా ఆమెను పోటీచేయించారు. ఆమె ఓడిపోయాక పార్టీ వైపు చూడడం లేదు. టీడీపీకి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి వైసీపీ బ్యాచ్ ఆమెకు దగ్గరవ్వడం టీడీపీకి షాక్ లా పరిణమించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: