ఎవరు ఎన్ని అన్నా సరే విపక్ష టీడీపీ కి ప్రధాన బలం కమ్మ సామాజిక వర్గమే. రాజకీయంగా ఆ పార్టీ నిలబడింది అంటే ఆ పార్టీ నుంచి వచ్చిన కొందరు బలమైన నేతలే కారణం. ఎన్టీఆర్ నుంచి మొదలుకుని ఇప్పుడు ఉన్న వల్లభనేని వంశీ, దేవినేని ఉమా, దేవినేని నెహ్రూ, కరణం బలరాం, ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల రవి, కోడెల శివప్రసాద్ ఇలాంటి ఎందరో కమ్మ సామాజిక వర్గ నేతలు పార్టీకి అండగా నిలబడ్డారు, నిలబెట్టారు.


వీరందరూ బలమైన నేతలు కావడంతో ఆ సామాజిక వర్గం కూడా చంద్రబాబుకి, పార్టీకి అండగా నిలబడింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది...? ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గం దూరంగా ఉంది. మొన్న ఎన్నిక‌ల్లో చాలా మంది క‌మ్మ‌లు వైసీపీకి స‌పోర్ట్ చేశారు. వైసీపీ నుంచి కూడా క‌మ్మ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారు. క‌మ్మ‌ల్లో చాలా మంది టీడీపీకి ఎందుకు ?  దూర‌మ‌య్యారంటే దీనికి ప్రధాన కారణాలు ఏమైనా సరే... ఇప్పుడు మాత్రం ఒక కారణం ప్రధానంగా వినపడుతోంది. అదే జనసేన పార్టీ.


జనసేన అనేది కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనేది కమ్మ సామాజిక వర్గంలో ఉన్న భావన. దానికి తోడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ బలంగా ఉన్న జిల్లాలోనే ఎక్కువగా పర్యటనలు చేసి సందడి చేస్తూ వచ్చారు. ఇక బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఎక్కువగా వారికి న్యాయం చేశారు అనే భావనలో కమ్మ సామాజిక వర్గం ఉంది.


ఐదేళ్ల పాల‌న‌లో బాబు కాపు మంత్రం ఎక్క‌వుగా జపించి అటు పార్టీకి ప‌ట్టుకొమ్మ అయిన బీసీల‌కు విస్మ‌రించార‌న్న టాక్ కూడా ఉంది. ఇక ఇచ్చిన పదవుల్లో కూడా కాపుల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేది వారి అభిప్రాయం. దీంతో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలబడుతుందని, చాలా మంది నేతలు ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత కూడా కొంత మందికి నచ్చడం లేదని పార్టీ కార్యకర్తలే స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ ప‌రిణామాలు అన్ని పార్టీ మీద న‌మ్మ‌కం లేని క‌మ్మ‌ల‌ను పార్టీకి దూరం చేసేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: