ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత భారీగా ఉందని, లక్షలాది మంది పనులు లేకుండా ఖాళీ గా ఉంటున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష టీడీపీ చేపట్టిన ఇసుక దీక్ష ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఆ పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఈ దీక్ష చుక్కలు చూపిస్తోంది. చంద్రబాబు ఈ నెల 14 న దీక్ష చేయడానికి గాను సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు కొన్ని లక్ష్యాలను విధించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఇసుక దీక్షకు భారీగా జనం రావాలి అనేది చంద్రబాబు వ్యూహం.


ఈ మేరకు ఒక భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందని కేంద్రానికి చెప్పాలి అనేది ఆయన ఆరాటం. ఇందులో భాగంగానే జన సమీకరణ బాధ్యతను కొందరు నేతలకు అప్పగించారు చంద్రబాబు. కృష్ణా జిల్లా విజయవాడలో ఈ దీక్ష చేస్తున్నారు కాబట్టి... విజయవాడకు తెలంగాణ దగ్గరగా ఉంటుంది, వంద కిలోమీటర్ల దూరంలో నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా లేవు.


ఈ క్ర‌మంలోనే అక్కడి నుంచి వ్య‌వ‌సాయ కూలీల‌ను తరలించాలని ఇందుకోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. దీనితో నేతలు ఇప్పుడు ఒక్కొక్కరికి రెండొందలు నుంచి 500 వరకు ఇస్తూ జన సమీకరణ కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు కార్యకర్తలను ఆ రెండు జిల్లాలకు పంపించి జ‌నాల‌ను అక్క‌డ నుంచి తీసుకురావాలని భావిస్తున్నారు.


ఇక దీనికి ప్రచారం కూడా ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారిందని కొందరు అంటున్నారు. ఇసుక కొరత నుంచి ఇప్పుడు ఇప్పుడే జనం బయటకు వస్తున్నారు. వరదలు తగ్గుతున్నాయి కాబట్టి పనులు కూడా పెరుగుతున్నాయి. దీనితో టీడీపీ నేతలకు జన సమీకరణ అనేది తల నొప్పిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: