జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాలు చేయడంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. 2014లో పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ప‌లు పార్టీల‌కు మ‌ద్ద‌తిచ్చారు. ఇక‌, ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. ఓడిపోయినా..ఓటు బ్యాంకును సంపాయించుకున్నారు. దీంతో గెలుపు ఓట‌ముల‌తో సంబందం లేకపోయి నా.. ప‌వ‌న్‌కు గ‌ట్టి ఓటు బ్యాంకు , ప్ర‌జ‌ల్లో అభిమానులు ఉన్నార‌నే విష‌యాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ అంగీక‌రించే విష‌యమే.


అయితే, వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ .. జ‌న‌సేనానికి ఏమాత్రం వాల్యూ ఇస్తున్నారు? ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటి? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ హించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స‌మ‌యంలో ప‌వ‌న్ గురించి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లే చేశారు జ‌గ‌న్. కార్ల‌ను మా ర్చిన‌ట్టు భార్య‌లను మారుస్తాడు.. ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా ఏం చెబుతాం. అంటూ వ్యాఖ్యానించి సంచ ల‌నాల‌కు తెర‌దీశారు. అప్ప‌ట్లో ప‌వ‌న్ కూడా ఇదే రేంజ్‌లో రియాక్ట‌య్యారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య కొన్నాళ్ల‌పాటు మాటల ఫైట్ సాగింది.


అయితే, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. సీఎంగా పాల‌న సాగిస్తున్నారు. అంతేకాదు, ఇటీవ‌ల ఎన్ని కల్లో జ‌న‌సేన‌తో వైసీపీ నాయ‌కులు త‌ల‌ప‌డ్డారు. గెలుపు ఎవ‌రిని వ‌రించినా.. రాష్ట్రంలో జ‌న‌సేన ప్ర‌భావం మాత్రం ఉంద‌నేది వాస్తవం. అయితే, ప‌వ‌న్‌పై ఇత‌ర పార్టీల అదినేత‌ల‌కు ఎలాంటి అభిప్రాయం ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌కు మాత్రం ఆయ‌న‌పై ఇప్ప‌టికీ ఎన్నిక‌ల‌కు ముందున్న అభిప్రాయ‌మే ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లే దీనికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. ప‌వ‌న్‌కు ముగ్గురు భార్య‌ల‌ని, వారికి న‌లుగురో ఐదుగురో పిల్ల‌ల‌ని, వారిని ఎక్క‌డ ఏ మీడియంలో చ‌దివిస్తున్నార‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి.


అయితే, ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అనూహ్య‌మైన మౌనం పాటిస్తోంది. కార్య‌క‌ర్త‌ల‌కు, శ్రేణుల‌కు స్పందించ‌వ‌ద్దంటూ ఆదేశాలు పంపింది. ఎక్క‌డ కేసుల్లో ఇరుక్కుంటారో.. అని ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డింది. ఏదేమైనా.. ప‌వ‌న్‌పై జ‌గ‌న్‌కు స‌దభిప్రాయం లేక పోవ‌డానికి ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలే కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గాను, ఇప్పుడు అధికార ప‌క్షంలో ఉన్నస‌మ‌యంలోనూ త‌మ‌నే టార్గెట్ చేయ‌డాన్ని జ‌గ‌న్ అండ్ కో లు స‌హించ‌లేక పోతున్నార‌న్న విష‌యం తెలిసిందే. సో.. మొత్తానికి ప‌వ‌న్ నోటి దురద ఆయ‌న‌ను జ‌గ‌న్ కు దూరం చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: