పెళ్లి అన్న తర్వాత బాజాభజంత్రీలు డీజే పాటలు డాన్సులు కామన్. ఇక ఇప్పటి పెళ్లి లో హోరెత్తించే డాన్సులు లేకపోతే అసలు పెళ్లి పెళ్లి లాగా అనిపించిందు అంటే నమ్మండి . వధువు వరుడు పెళ్లి లో రెచ్చిపోయి మరీ డాన్సులు చేస్తుంటారు. ఇది చూసిన మిగతా వారు డాన్స్ చూసి తెగ  సంబరపడిపోతుంటారు . ఇక్కడ ఓ వరుడు  అదే చేసాడు. తన పెళ్లిలో స్నేహితులతో కలిసి నాగిని డాన్స్ చేశారు. వరుడు డాన్స్ చుసిన  వధువు వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది . నాకు వరుడు వద్దు అంటూ తేల్చి చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకోగానే కోపంతో ఊగిపోయిన  వరుడు గూబగుయ్యమనిపించాడు . 



 ఉత్తరప్రదేశ్ లోని రాయి బలేరీ  జిల్లాలోని  లాఖిమ్  పూర్ కు చెందిన అబ్బాయికి షాజపూర్ కు చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అయితే ముహూర్తం సమయానికి పెళ్లి కొడుకు తన స్నేహితులు తో కలిసి ఉత్సాహంగా నాగిని డాన్స్ చేశాడు. పెళ్లి దుస్తుల్లోనే రెచ్చిపోయి మరి డాన్స్ ఇరగదీసాడు. ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురు మాత్రం పెళ్ళికొడుకు డాన్స్  చేయడం చూసి ఎబ్బెట్టుగా ఫీల్ అయింది. వీడేంటి ఇలా గెంతుతున్నాడు  అంటూ అసహ్యించుకుంది  పెళ్లికూతురు. అంతేకాదండోయ్ ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవాలా అనుకుంది.   దీంతో నాకు ఈ  పెళ్లి వద్దు అంటూ తెగేసి చెప్పేస్తుంది. ఈ  విషయం తెలిసిన వరుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. 



 అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న పెళ్ళికొడుకు... పెళ్లికూతురు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడంతో కోపంతో ఊగిపోయి పెళ్లికూతురు గూబ గుయ్యిమనిపించాడు. ఇంకేముంది బాజాభజంత్రీలతో పెళ్లితంతు జరగాల్సిన పెళ్లిపందిరి కాస్త రణరంగంగా మారిపోయింది. ఇక అటు పెళ్లికూతురు వైపు వాళ్ళు...  ఇటు పెళ్లి కొడుకు వైపు వాళ్ళు   చేతికందిన వస్తువులతో గొడవ పడ్డారు. అయితే ఇంతలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరికి పెళ్లి కూతురు కుటుంబం వరుడుకీ  ఇచ్చిన లాంఛనాలన్నీ  పెళ్ళికొడుకు కుటుంబం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించడం తో గొడవ కాస్త సద్దుమణిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: