తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సీన్ తెర‌మీద‌కు రానుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానని ఉత్తమ్ ఇప్పటికే చెప్పడంతో.. కొత్త సారథి ఎంపిక వ్యవహారం పార్టీలో కాక పుట్టిస్తున్నది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ తనకే ఇవ్వాలంటూ పట్టుపడుతుండగా.. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కే జానారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేత‌లంతా....ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పార్టీ పెద్దలకు లేఖలు రాస్తున్నారని, సామాజికవర్గాలుగా విడిపోయి అధ్యక్ష స్థానానికి ప్ర యత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు.
 
ఈ నెల 16 తర్వాత పార్టీ శ్రేణుల అభిప్రాయం సేకరించాకే అధ్యక్షుడిని ఎంపికచేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో...రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వొదంటూ వీహెచ్ బహిరంగంగానే డిమాండ్ చేశారు. వీహెచ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ షబ్బీర్‌అలీ, మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన తమకే ఈసారి అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేలు సంపత్, దామోదర రాజనర్సింహా తదితరులు పార్టీ అధిష్ఠానానికి లేఖలు పెట్టుకొన్నారు. వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ కూడా బీసీ కోటాలో తమకే అధ్యక్ష పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. 


విభేదాలకు చిరునామాగా నిలిచిన కాంగ్రెస్‌లో  గాంధీభవన్‌లో మరోసారి గలాటా జరగ‌డం ఆ పార్టీ పెద్ద‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ని అంటున్నారు. ఢిల్లీ పెద్దముందే పార్టీ సీనియర్లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సీనియర్లకు అన్యాయం జరుగుతున్నదని, ఆర్‌ఎస్‌ఎస్ సానుభూతిపరులకు పెద్దపీటవేస్తున్నారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి షబ్బీర్‌అలీపై మాజీ ఎంపీ వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షబ్బీర్ కూడా ఎదురుతిరుగడంతో ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు నేత‌లకు అవ‌కాశం త‌క్కువ‌ని కొంద‌రు చెప్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: