ఇప్పుడున్న పరిస్దితుల్లో మన దేశంలో ఆధార్ అనేది  ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన గుర్తింపు కార్డు. కొన్ని ముఖ్యమైన పనులు  ఆధార్ కార్డు లేదంటే ఆగిపోతాయి. అంతగా  మన జీవితాల్లోకి ఆధార్ వచ్చేసింది. ఇక ఇల్లు మారినప్పుడల్లా ఓటర్ ఐడి, ఆధార్,  తదితర గుర్తింపు కార్డుల్లో అడ్రెస్ కూడా మార్చుకోవడం తప్పనిసరి. అయితే మిగతా గుర్తింపు కార్డుల సంగతేమో గానీ.. ఆధార్ కార్డు వివరాలు మాత్రం ఇక మీదట ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్నిసార్లంటే అన్నిసార్లు మార్చుకోవడం అసలు కుదరని పని.


ఈ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకుగాను యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ నిబంధనలను పూర్తిగా మార్చేసింది. ఇకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు కలిగిన వారు గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ఊరట కలిగించేందుకు ఐటీఆర్ సమయంలో పాన్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది.


అయితే ఇక్కడే జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఇచ్చే ఆధార్ నెంబర్ తప్పు అయితే మీకు రూ.10 వేల జరిమానా పడొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961కు సవరణలు చేశారు కాబట్టి, పాన్ నెంబర్‌కు బదులు ఆధార్ నెంబర్ ఇవ్వడంతోపాటు ఆధార్ నెంబర్ తప్పు చెబితే రూ.10,000 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా పాన్ నెంబర్ తప్పుగా చెబితే లేదంటే ఒకటి కన్నా ఎక్కువ పాన్ నెంబర్లు కలిగి ఉన్నా  రూ.10 వేల జరిమానా ఉంటుందని తెలుపుతున్నారు.


ఇకపోతే ఐటీఆర్ దాఖలు సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం గాని, లేదా పాన్ కార్డ్ ఇవ్వాల్సిన స్థానాలలో ఆధార్ ఇచ్చినప్పుడు కూడా ఈ పెనాల్టీ రూల్స్ వర్తిస్తాయి. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్ తెరవడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టెమెంట్, రూ.50 వేలకు పైన లావాదేవీలకు పాన్ బదులు ఆధార్ ఇచ్చినప్పుడు, ఆ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అప్పుడు రూ.10 వేల పెనాల్టీ తప్పక పడుతుంది. గతంలో  కేవలం పాన్ నెంబర్‌కు మాత్రమే జరిమానా పరిమితం అయ్యింది.


అయితే ఇప్పుడు ఆధార్, పాన్ ఇంటర్‌ఛేంజబిలిటీ అమలులోకి రావడంతో ఇప్పుడు ఆధార్ కార్డుకు కూడా వర్తిస్తుంది. ఇకపోతే ఆధార్ నెంబర్ ఎన్ని సార్లుతప్పుగా ఇస్తారో ఫైన్ అన్ని సార్లూ  పడుతుంది. అంటే  రెండు ఫామ్స్‌లో ఆధార్ నెంబర్ తప్పుగా వేస్తే.. అప్పుడు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇకపోతే ఈ జరిమానాను  యూఐడీఏఐ కాకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విధిస్తుంది. సో ఆధార్, పాన్ కార్డ్ వినియోగ దారుల్లారా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేదంటే మీ జేబులకు భారీగా చిల్లులు పడే అవకాశాలున్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: