ఏపీలో సాధారణ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు అయ్యాయి. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తో కేవలం 23 చెట్లతో సరిపెట్టుకున్న టిడిపిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరు ఊహించ‌లేక పోతున్నారు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసేశారు. ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు వైసీపీ లోకి వెళ్ళిపోతున్నారు. అంత‌ ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ లాంటి నేతలు సైతం పార్టీలో ఉండ‌లేమ‌ని చెప్పేస్తున్నారు.


చంద్రబాబు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా... పార్టీలో ఉండేందుకు ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. చంద్రబాబు మూడు దశాబ్దాలుగా నడిచిన సీనియర్లు సైతం మరో ఏడాది పాటు వెయిట్ చేసి అప్పటికి పార్టీ పుంజుకోక‌పోతే జంప్ చేయాల‌న్న‌ ఆలోచనలో ఉన్నారు. ఇక చంద్రబాబు వర్గానికి చెందిన కీలక నేతల పరిస్థితి కూడా పార్టీలో ఉంటార‌ని న‌మ్మేలా లేదు.


ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీకి చెందిన పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్ర‌స్తుత అసెంబ్లీ సీజ‌న్లోనే ఏపీలో బీజేపీ బ‌ల‌మైన పార్టీగా ఎదుగుఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.


ఏదో ఒక రోజు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని కూడా సోము సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అవుతుందన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేర‌తార‌న్న సోము... 22 ఎమ్మెల్యేలతో పాటు ఆఖరిలో చంద్రబాబు కూడా బీజేపీలోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో చూడాలన్నారు. ఏదేమైనా గంటాతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తుండ‌గా.. అందుకు సోము చేసిన వ్యాఖ్య‌లు సైతం ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల‌ను టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: