``“దేశమంతా హిందీ మాట్లాడేలా చేయాలి అనుకున్న మోడీ గారు, అమిత్ షా గారి లాంటి వ్యక్తులే తమిళనాట నిరసనలు ఉవ్వెత్తున వెల్లువెత్తినపుడు వెనక్కి తగ్గారు. దేశాన్ని శాసించే స్థాయి వ్యక్తులే వెనక్కి తగ్గినప్పుడు మీరెంత? తెలుగు భాషనుగాని, సంస్కృతినిగానీ, ఉనికినిగాని చంపేసే ప్రయత్నాలు చేస్తే మీరంతా మట్టిలో కలిసిపోతారు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెబుతున్నా``అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. 


బుధ‌వారం ఆయ‌న‌ విశాలాంధ్ర, ఎమెస్కో బుక్ హౌస్ లను సందర్శించారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ``మ‌న రాష్ట్రంలో మేధావుల గొంతు బలంగా ఉండదు. నేను మేధావులు, భాషా శాస్త్రవేత్తలకు పిలుపు ఇస్తున్నాను... మీరు భయాల్ని వదిలి బయటకు రావల్సిన అవసరం ఉంది. మాట్లాడవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో తమ భాష, యాస, సంస్కృతులకు అవమానం జరిగిందని భావించినప్పుడు అక్కడ మేధావులు ఎలా అయితే బయటకు వచ్చారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేధావులు అలా బయటకు రావాలి. బయటకు రాకపోతే భావితరాలకు ద్రోహం చేసిన వారిమవుతాం.`` అని అన్నారు.


``తమిళ భాష మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే తమిళనాడు మొత్తం ఏకగళమయ్యింది. నాయకుల మధ్య రాజకీయంగా బేధాభిప్రాయాలు ఉన్నా భాష విషయంలో ఐక్యత చాటుకున్నారు. మన దురదృష్టం, మన దౌర్భాగ్యం- మన రాజకీయ నాయకులకు తెలుగు భాష పట్లగానీ, సంస్కృతి పట్లగానీ ప్రేమ లేదు. మాట్లాడితే ఇందులో కూడా పాడు రాజకీయాలు తీసుకువస్తారు. మేం మాట్లాడుతోంది ఏంటి.. మీరు చెప్పేది ఏంటి? మాట్లాడితే రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. నేనూ ప్రాథమిక విద్య అంతా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని తెలుగులో చదివించాలి అంటే ముందుగా స్కూల్స్ శుచీశుభ్రతతో ఉండాలి. ఆడపిల్లలకు బాత్ రూములు ఉండాలి. అలా ఉంటే తెలుగు మీడియంలో చదవడానికి ఆసక్తి చూపే వారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్నే మీరు ముందుకు తీసుకువెళ్తే ఎలా?` అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: