హీరోయిన్ శ్రియాకు ఆ మధ్య పెళ్లయిన సంగతి తెలిసిందే. అయినా అమ్మడు అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె ఓ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్లో అందాలు ఆరబోసింది. ఫోటోలో చూస్తే ఫ్యాన్స్ సరిగ్గా సంతృప్తి చెందుతారో లేదో అనుకుందో ఏమో ఏకంగా వీడియో పోస్టు చేసింది.


ఈ వీడియోలో శ్రేయ తడిపొడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు పండుగ చేస్తోంది. 'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన .. మొదటి సినిమాతోనే అందరికీ ఇష్టమైన హీరోయిన్‌గా మారింది.


కొన్నేళ్లుగా టాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలిగింది. రెండు తరాల అగ్ర హీరోలతో తెలుగులో రెండు తరాల అగ్ర హీరోలతో ఆడిపాడిన కొద్ది మందిలో శ్రీయ ఒకరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ల సరసన నటించి మెప్పించిన శ్రీయ.. వారితో కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.


ఇక ఇప్పటి తరం విషయానికి వస్తే.. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతోనూ నటించింది. ఇక తమిళ సూపర్ స్టార్. రజినీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ' మూవీలో హీరోయిన్‌గా నటించి మాంచి హిట్ సాధించింది.


సౌత్ లోనే కాదండోయ్.. బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. కాకపోతే అక్కడ పెద్దగా సక్సస్ దక్కలేదు. ఆ మధ్య ‘మనం’ సినిమాలో .. ఆ తర్వాత బాలయ్య సరసన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలోనూ ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత కాస్త జోరు తగ్గిన శ్రియా సోషల్ మీడియాలో మాత్రం అప్ టు డేట్ ఉంటోంది. ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్ పెడుతూ అభిమానులను అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: