కొన్ని రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తున్న పేరు దేవినేని అవినాష్. 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి టీడీపీ పార్టీ తరుపున పోటీ  చేసిన గెల్వలేకపోయారు. అప్పటి నుంచి అవినాష్ ఆలోచనలో పడిపోయారు. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడి గా కాంగ్రెస్ పార్టీ లో ఉండగానే విజయవాడ నగరం లో కీలక నేతగా ఎదిగిన అవినాశ్... మొన్నటి ఎన్నికల కు కాస్తంత ముందు గా టీడీపీ లో చేరారు. అవినాశ్ రాజకీయ భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకునే నాడు నెహ్రూ తన కుమారుడి తో కలిసి టీడీపీ లో చేరారు. ఎన్నికల్లో తనకు బలమున్న గన్నవరం గానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం గానీ కేటాయించాలని అవినాశ్ డిమాండ్ చేస్తే... ఆయన డిమాండ్ల ను పక్కన పెట్టిన చంద్రబాబు... కొడాలి నాని ని ఓడించడానికి ఆయన ను గుడివాడ కు పంపారు.


అయితే గుడివాడలో కొడాలి నాని జోరును అవినాష్ తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో గుడివాడ లో జరిగిన హోరాహోరీ పోరు లో కొడాలి నాని చేతిలో అవినాశ్ చిత్తు గా ఓడిపోయారు. అప్పటి నుంచే అవినాశ్... టీడీపీలో తనకు భవిష్యత్తు లేదన్న కోణం లో విశ్లేషణలు ప్రారంభించారట. ఈ విషయాన్ని వైసీపీ కీలక నేతలు జగన్ కు చేర వేయగా... ఆయన వేచి చూద్దామన్న రీతిలో సాగారు. అయితే ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే గా ఎన్న వల్లభనేని వంశీమోహన్ టీడీపీ కి రాజీనామా ద్వారా చంద్రబాబు కు గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు ఇసుక దీక్షంటూ నగరం లో చంద్రబాబు భారీ దీక్షను చేసేందుకు నిర్ణయించారు.


అయితే సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే అవినాష్ ను పార్టీలోకి ఆహ్వానించడానికి వైసీపీ రంగం సిద్ధం చేస్తుంది. గురువారం ధర్నా చౌక్ కేంద్రంగా చంద్రబాబు 12 గంటల దీక్ష కు కూర్చోనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కు మరో గట్టి షాకిచ్చేలా ఇటు వైసీపీ అటు అవినాశ్ వర్గం వ్యూహం రచించినట్టు గా తెలుస్తోంది. బుధవారం సాయంత్రమే అవినాశ్ తన ఇంటి లో అనుచర వర్గం తో కీలక భేటీ నిర్వహించారట. ఈ భేటీలో కార్యకర్తలంతా వైసీపీ లో చేరి పోదామంటూ అవినాశ్ కు చెప్పేశారట. ఇక అవినాశ్ ను ఆహ్వానించేందుకు వైసీపీ కూడా రెడీగానే ఉందట. ఈ నేపథ్యం లో చంద్రబాబు దీక్ష చేసే రోజునే అవినాశ్ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడేలా రంగం సిద్ధమవుతున్నట్లు గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: