ఎంతోమంది టీచర్ వృత్తిలోకి రావాలని ఆశ పడుతున్నారు. టీచర్ వృత్తి లోకి వచ్చి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆలోచన తో టీచర్ వృత్తిలోకి రావాలని కోరుకుంటారు . అయితే తెలంగాణలో ఎంతో మంది టీచర్లు లోకి రావాలని ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం టెట్ పరీక్షను కూడా రాసారు. పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు కానీ ఇప్పటివరకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీమాత్రం జరగలేదు. ఇక ప్రభుత్వం  ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడు చేస్తుందా  అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చాక  ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుంది అందరూ భావించారు కానీ ఇప్పుడు వరకు మాత్రం అలాంటి ఊసే ఎత్తలేదు తెలంగాణ సర్కార్. 

 

 

 

 ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఖాళీల భర్తీ చేయడానికి ముందుకు రావడం లేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వెంకటేష్  అనే వ్యక్తి. అయితే దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి... పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి కి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 

 

 

 తెలంగాణ రాష్ట్రంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని... వాటిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయటం లేదనే దానిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... ఈ పిటిషన్ పై  విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా నేడు సుప్రీం కోర్టులో శబరిమల కు మహిళలలకు అనుమతి విషయంలో దాఖలైన పిటిషన్ పై తీర్పు వెలువడనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: