ఆవుకథ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. చెప్పిందే ఒకటికి పదిసార్లు చెప్పటాన్ని ఆవుకథ అంటారు. దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఇసుకకొరతపై ఇన్నిరోజులుగా ప్రభుత్వంపై చేస్తున్న  ఆరోపణలు, విమర్శలనే చంద్రబాబు మళ్ళీ మళ్ళీ వినిపించారు.

 

ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించిన కొరతే. తమ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులు. ఇసుక కొరతను సృష్టించి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. సిఎం ఓ పనికిమాలిన వ్యక్తి. సమస్యల పరిష్కారంపై ఒక్క నిముషం కూడా దృష్టి సారించలేని వ్యక్తి.

 

సమస్యలను ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షాలపై వైసిపి నేతలు ఎదురుదాడులు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను టిడిపి నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే  తమ వాళ్ళపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇసుక కొరత వల్ల 35 లక్షల కుటుంబాలు పనులు లేక అవస్తలు పడుతున్నారు.

 

చంద్రబాబు ప్రసంగం మొత్తం ఇలాగే సాగింది. ఇసుక కొరతపై గడచిన మూడు నెలలుగా చంద్రబాబు చేసిన ఆరోపణలను, విమర్శలనే చేసి చేసి విసుగెత్తించేశారు.  సరే చంద్రబాబు మాట్లాడినదానిలో కొత్తదనం ఏమీ లేదు కాబట్టి దీక్షకు వచ్చిన వారిలో స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. పైగా భవన నిర్మాణ కార్మికులంటూ ఓ నలుగురిని తీసుకొచ్చి వేదిక మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

 

తమ దీక్షకు, పోరాటానికి ప్రజలు సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే చంద్రబాబు మాటల్లోనే తమ పోరాటానికి ప్రజల మద్దతు లేదని అర్ధమైపోతోంది.

 

నిజానికి దీక్షా వేదిక దగ్గర ఇలాంటి సీనే కనబడింది.  చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీక్షకు పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో చాలామంది  హాజరుకాలేదు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, రామానాయుడు లాంటి కొద్దిమంది ఎంఎల్ఏలు మాత్రం కనబడ్డారు. గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు కూడా కనబడలేదు.


రాజీనామా చేశాడు కాబట్టి గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ హాజరుకాలేదు. దీక్షలో ఎంఎల్ఏలు, ఎంపిలు, సీనియర్ నేతలందరూ పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించినా ఎక్కువమంది అటెండ్ కాకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: