సుప్రీంకోర్టు శబరిమలలో 10సంవత్సరాల నుండి 50సంవత్సరాలలోపు వయస్సు గల మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును విసృత ధర్మాసనానికి బదిలీ చేసింది. జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ మెజార్టీ జడ్జీల అభిప్రాయంతో విభేదించారు. ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును బదిలీ చేశారు. 
 
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధినిన కేసు గురించి స్పందిస్తూ మా ముందుకు అనేక పిటిషన్లు వచ్చాయన్ని అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని అన్ని పిటిషన్లపై విచారణ చేశామని అన్నారు. ఈ ఒక్క ఆలయానికి మాత్రమే మహిళలకు ప్రవేశ వివాదం పరిమితం కాలేదని మతంలో అంతర్గత విషయం తేల్చడమే మా పని అని రంజన్ గొగోయ్ వ్యాఖ్యలు చేశారు. 
 
కేరళ హైకోర్టు 1991వ సంవత్సరంలో 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయస్సు గల మహిళలకు ఆలయ ప్రవేశం లేదని ఈ నిషేధానికి చట్టబద్ధత కల్పించింది. 2006లో కొంతమంది ఈ నిషేధంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 సెప్టెంబర్ 28 వ తేదీన సుప్రీంకోర్టు 10 సంవత్సరాలనుండి 50 సంవత్సరాల లోపు వయస్సు గల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం సరికాదని పేర్కొన్నారు. 
 
సుప్రీంకోర్టు తీర్పుపై 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈరోజు ఈ కేసుకు సంబంధిన కీలక తీర్పును కోర్టు వెలువరించింది. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేసును విసృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పును వెల్లండించింది.. సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్ వేయడం గమనార్హం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: