దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గత కొంతకాలంగా కీలక తీర్పులు వెలువరిస్తోంది.తాజాగా గత  30 సంవత్సరాల నుండి పరిష్కారం కాని అయోధ్య వివాదాస్పద భూభాగానికి కూడా సంచలన తీర్పును వెలువరించింది ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం. కాగా నేడు మరో కీలక తీర్పు వెలువరించనుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై 64 రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే గతంలో 2018 సెప్టెంబర్ నెలలో అయ్యప్ప సన్నిధి లోకి మహిళలను కూడా ప్రవేశం అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో దేశంలో ఎన్నో రాజకీయ, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి . పురాణాలు వేదాలు స్థల పురాణాలు చెబుతున్న వాటిని పాటించాలని కొత్తగా చట్టాలు వాటిని మార్చడం సరికాదని  అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో నిరసనలు తెలిపారు. కొన్ని రోజుల వరకు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ 64 రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో దీనిపై సుప్రీంకోర్టు మరోమారు విచారించింది. 

 

 

 

 అయితే నేడు అయిదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం తీర్పును వ్యతిరేకిస్తూ 64 రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.  అయితే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీలు రివ్యూ పిటిషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం శబరిమల పై ముగ్గురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా...మరో ఇద్దరు డాన్ని విభేదించారు. దీంతో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాకపోవడంతో.. ఈ పిటిషన్పై తీర్పును ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులు నిర్ణయించారు . 

 

 

 ముగ్గురు న్యాయమూర్తుల వాదనతో విభేదించిన చ జస్టీస్ చంద్ర చూడ్, జస్టిస్ నారీమన్  శబరిమల వివాదం పై తుది తీర్పును ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే  గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 64 రివ్యూ పిటిషన్లను ప్రస్తుతం పెండింగ్లో ఉంచింది అత్యున్నత ధర్మాసనం. అయితే సుప్రీంకోర్టు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం పై ఎలాంటి తీర్పు వెలువరిసస్తుందా అని  అయ్యప్ప భక్తులతో పాటు మహిళలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయ్యప్ప ను పూజించేందుకు  మగవారితో  పాటు తమకు కూడా సమాన హక్కు కల్పించాలని మహిళలు  డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: