వేతన జీవుల భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉపయోగపడే సేవింగ్స్ లో ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రాఫిడెంట్ ఫండ్) కూడా ఒకటని చెప్పక తప్పదు. ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి 12శాతం అమౌంట్ ని కట్ చేసి ఈపీఎఫ్ ఖాతాలో జమచేయడం జరుగుతుంది. అయితే దానికి సదరు ఉద్యోగి పని చేసే సంస్థ వారు కూడా అంతే మొత్తం సొమ్మును వారి పీఎఫ్ ఖాతాకు జమ చేయడం జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. ఇక కొన్నేళ్లకు ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత, మొత్తంగా జమచేయబడిన ఆ సొమ్మును ఉద్యోగి ఒక్కసారిగా తీసుకుని తన భవిష్యత్ అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. 

అయితే మనలో కొందరు తమకు ప్రస్తుతం అవసరాలు ఏమైనా ఉంటె ఆ పీఎఫ్ డబ్బును ముందే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. వాస్తవానికి పీఎఫ్ ఎంప్లాయి కంట్రిబ్యూషన్‌కు సెక్షన్ 80సీ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఐదేళ్ల కంటే ముందుగానే పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకుంటే మాత్రం అప్పుడు సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు వర్తించదు.అంటే ఉద్యోగి కంట్రిబ్యూషన్‌, దీనిపై అర్జించిన వడ్డీ, కంపెనీ కంట్రిబ్యూషన్, దీనిపై వచ్చిన వడ్డీ వంటి అన్నింటికీ పన్ను వర్తిస్తుంది. అందుకనే ఐదేళ్ల వరకు వేచి చూసి అటుపైన అవసరం అనుకుంటే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోండి. ఉద్యోగం మారే సమయంలో కూడా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవద్దని అంటున్నారు. 

అవసరం అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఆ విధంగా ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకోండని అంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే అవకాశం ఉన్నంతవరకు పీఎఫ్ డబ్బులను తీసుకోకుండా అలాగే భద్రంగా ఉంచుకోవడం బెటర్ అని, ఎందుకంటే ప్రస్తుత అవసరాలను ఒకింత అదుపు చేసుకోగలిగితే ఆ సొమ్ముతో మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు. అయితే వారు సూచిస్తున్న దానిని బట్టి మన పీఎఫ్ సొమ్మును, ఏదయినా అత్యవసర పరిస్థితి వస్తే మాత్రమే తీసుకోవడం బెటర్ అని తెలుస్తోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: