తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని నిలదీశారు. కార్మికులు ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోయి రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే... ఇంటి దొంగలు సీఎంకు కనపడరా...? అని చంద్రబాబు ప్రశ్నించారు. 
 
దాదాపు 50 మంది కార్మికులు చనిపోయినా ప్రభుత్వం స్పందించదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉచిత ఇసుక పాలసీ మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం అని చంద్రబాబు అన్నారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇసుక మాఫియాను కట్టడి చేసి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని అన్నారు. 
 
కానీ గడచిన ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం వందల కోట్ల రూపాయలు కురిపించింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుక రీచ్ ల వద్ద లారీకి 20వేల రూపాయలు, 30వేల రూపాయలు వసూలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇసుకను పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. 
 
ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీకి తెరలేపారు. తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తల నుండి ఎమ్మెల్యేల వరకు ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు అన్నది బహిరంగ రహస్యం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరదల కారణంగా ఇసుక తీయలేని పరిస్థితి ఏర్పడితే పరిస్థితులను రాజకీయంగా వాడుకుని వైసీపీపై బురద జల్లేందుకు విమర్శలు చేస్తున్నారని తన హయాంలో కోట్ల రూపాయల అవినీతి చేసిన చంద్రబాబు మరలా ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: