రెండు రోజుల క్రితం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఎంఎంటీఎస్ రైలు ఆగి ఉన్న ఎక్స్ ప్రెస్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో క్యాబిన్ లో ఉన్న లోకోపైలట్ చంద్రశేఖర్ ను దాదాపు 8 గంటల పాటు కష్టపడి రెస్క్యూ సిబ్బంది రక్షించారు. రైల్వే అధికారులు ప్రాథమికంగా ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందని నిర్థారించారు. 
 
ఈరోజు వైద్యులు చంద్రశేఖర్ కుడికాలును మోకాలు వరకు తొలగించారు. లోకో పైలట్ చంద్రశేఖర్ కాలు ప్రమాదం జరిగిన తరువాత రైలులో ఇరుక్కుంది. రైలులో కాలు ఇరుక్కున్న సమయంలో చంద్రశేఖర్ కాలుకు రక్తప్రసరణ జరగలేదు. రక్తప్రసరణ జరగకపోవటంతో పాటు చంద్రశేఖర్ కుడికాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం చంద్రశేఖర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలు తొలగించినప్పటికీ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 
 
సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 18మందికి గాయాలయ్యాయి. రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద క్యాబిన్ లో ఇరుకున్న లోకోపైలట్ చంద్రశేఖర్ ను బయటకు తీశారు. ప్రమాదం గురించి రైల్వే శాఖ ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. కమిటీ నివేదిక తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఆస్పత్రి వైద్యులు చంద్రశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం లోకోపైలట్ చంద్రశేఖర్ కు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోంది. చంద్రశేఖర్ రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని తెలుస్తోంది. లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడితే మాత్రమే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. లోకోపైలట్ చంద్రశేఖర్ తప్పిదం వలనే రైలు ప్రమాదం జరిగిందని చంద్రశేఖర్ పై కేసు నమోదైంది. చంద్రశేఖర్ కోలుకున్న తరువాత పోలీసులు చంద్రశేఖర్ వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: